ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవనశైలిలో మార్పులతో వ్యాధి నిరోధక శక్తి పెంపు

ABN, First Publish Date - 2020-08-13T07:58:37+05:30

జీవనశైలిలో మార్పుతోనే వ్యాధి నిరోధక శక్తి పెంపు సాధ్యమని తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ మమత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వెబినార్‌లో పద్మావతి మహిళా వర్సిటీ రిజిస్ట్రార్‌ 


పీలేరు, ఆగస్టు 12: జీవనశైలిలో మార్పుతోనే వ్యాధి నిరోధక శక్తి పెంపు సాధ్యమని తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ మమత పేర్కొన్నారు. పీలేరులోని సంజయ్‌గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఔషధ మొక్కలు-ఉపయోగాలు’ అనే అంశంపై బుధవారం జాతీయ స్థాయి వెబినార్‌ నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ మమత మాట్లాడుతూ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకున్నప్పుడు కరోనా లాంటి వైర్‌సలు ప్రభావం చూపబోవన్నారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ ప్రొఫెసర్‌ పుల్లయ్య మాట్లాడుతూ సాధారణంగా  పరిసరాల్లో లభ్యమయ్యే తులసి, తిప్పతీగ, వేప, అల్లం, పసుపు వంటి మొక్కల ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవచ్చన్నారు.


ఎస్వీయూ ఆయుర్వేద కళాశాల ప్రొఫెసర్‌ డాక్టర్‌ ప్రసూన మాట్లాడుతూ వివిధ ఔషధ మొక్కల విభాగాలను మందులుగా ఎలా వాడుకోవాలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీరాములు అధ్యక్షత వహించగా, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నారాయణస్వామి, అధ్యాపకులు హరిప్రసాద్‌, మునినాయక్‌, సంధ్యా, కిషోర్‌కుమార్‌, కుల్లాయస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2020-08-13T07:58:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising