టీటీడీ ఇంచార్జ్ ఈవోగా ధర్మారెడ్డి భాధ్యతలు స్వీకరణ
ABN, First Publish Date - 2020-10-04T19:01:06+05:30
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌ను జగన్ సర్కార్ బదిలీ చేసిన విషయం విదితమే.
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌ను జగన్ సర్కార్ బదిలీ చేసిన విషయం విదితమే. ఆయన్ను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కాగా ఆదివారం నాడు టీటీడీ ఇంచార్జ్ ఈవోగా ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి టీటీడీ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ఇది తాత్కాలికం మాత్రమే.
రేపు అనగా సోమవారం నాడు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే.. నూతన ఈవోగా ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్‌రెడ్డిని నియమించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. జవహర్‌రెడ్డి గత కొంతకాలంగా తనను టీటీడీ ఈవోగా నియమించాలని అడుగుతున్నట్లు తెలిసింది. పైగా సింఘాల్‌ను వైద్య శాఖకు పంపడంతో అదే శాఖ చూస్తున్న జవహర్‌రెడ్డిని టీటీడీకి బదిలీ చేయొచ్చని అంటున్నారు.
Updated Date - 2020-10-04T19:01:06+05:30 IST