ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నదాతల నడ్డి విరుస్తున్న బీజేపీ, వైసీపీ

ABN, First Publish Date - 2020-12-02T05:19:18+05:30

నిరంకుశ పాలనతో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలు అన్నదాతల నడ్డి విరుస్తున్నాయని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ సురేష్‌బాబు విమర్శించారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షులు సురేష్‌బాబు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ సురేష్‌బాబు

కుప్పం, డిసెంబరు 1: నిరంకుశ పాలనతో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలు అన్నదాతల నడ్డి విరుస్తున్నాయని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ సురేష్‌బాబు విమర్శించారు. కుప్పంలో మంగళశారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు వ్యవసాయ భారతాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయన్నారు. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులకు మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీ శ్రీకాకుళం నుంచి ప్రారంభించే పాదయాత్రకు అన్నివర్గాల ప్రజలు, పార్టీలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్‌ అమలు చేస్తే ఆయన తనయుడు ఆ పథకానికి మంగళం పలుకుతు న్నాడని మండిపడ్డాడు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలనడం అందులో భాగమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్‌ రద్దు కాకుండా కాంగ్రెస్‌ పార్టీ పోరా డుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీసీపీ అధికార ప్రతినిధి కె.వెంకటరమణబాబు, కాంగ్రెస్‌ పార్టీ గుడుపల్లె మండలాధ్యక్షుడు బైరేగౌడు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T05:19:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising