వి.కోటలో కరోనా కలకలం
ABN, First Publish Date - 2020-05-09T09:00:35+05:30
కోయంబేడు మార్కెట్‌కు కూరగాయలు తీసుకువెళ్ళి వచ్చిన వికోట వాసుల్లో ఐదుగురికి కరోనా పాజిటీవ్‌గా అధికారులు
ఐదుగురికి పాజిటివ్
మరో నలుగురికీ సోకినట్టు అనుమానం
రెడ్‌జోన్‌గా ప్రకటించిన కలెక్టర్ భరత్‌గుప్తా
స్వచ్చంద లాక్‌డౌన్‌లో ప్రజలు
ఏరియా ఆసుపత్రిలో ట్రూనాట్ పరీక్షలు - డీఎంహెచ్‌వో పెంచలయ్య
వి.కోట, మే 8: కోయంబేడు మార్కెట్‌కు కూరగాయలు తీసుకువెళ్ళి వచ్చిన వికోట వాసుల్లో ఐదుగురికి కరోనా పాజిటీవ్‌గా అధికారులు ధృవీకరించారు. గురువారం ఏడుగురికి పరీక్షలు చేయగా ఐదుగురికి ఐవరస్ సోకినట్టు తేలింది. రెండవ విడత శుక్రవారం 36 మందిని పరీక్షల నిమిత్తం తరలించగా వారిలో నలుగురికి పాజిటీవ్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే నిర్ధారణ కోసం తిరుపతికి శాంపిల్స్ పంపారు. రెండో విడత పరీక్షల్లోఇంకా కొన్ని ఫలితాలు రావాల్సి ఉంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో వి.కోట తల్లడిల్లుతోంది. పాజిటివ్ వచ్చిన నలుగురు వ్యవసాయ మార్కెట్‌కు ఆనుకునే ఉన్న పట్రపల్లె వాసులు రావడంతో ఆ గ్రామానికి రాకపోకలను నిలిపివేశారు. అన్ని వైపులా రోడ్లను మూసివేశారు. మరి కొంత మంది అనుమానితులను ప్రాథమిక పరీక్షల నిమిత్తం తరలించడంతో ఆయా గ్రామాలో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పాజిటీవ్ వచ్చిన ఐదుగురి ద్వారా ప్రయిమెరీ కాంటాక్ట్స్‌గా 26 మంది కుటుంబ సభ్యులను గుర్తించారు. సెంకడరీ కాంటాక్ట్స్ కోసం సర్వే చేస్తున్నారు. పాజిటీవ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుండీ వి.కోట పట్టణంలో ప్రజలు ఎవ్వరూ బయటకు రాకపోవడంతో కర్ప్యూ వాతావరణం నెలకొంది. జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్ శుక్రవారం పట్టణంలో లాక్‌డౌన్ అమలును పర్యవేక్షించారు.
కోయంబేడుకి వెళ్ళివచ్చిన వారు పరీక్షలు చేసుకోండి: కలెక్టర్
కోయంబేడు కరోనాకు హాట్‌స్పాట్‌గా తయారైందని, గత నెల రోజులుగా కోయంబేడు మార్కెట్‌కు వెళ్ళి వచ్చిన వ్యాపారులు, డ్రైవర్లు, రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేసుకోవాలని కల్లెక్టర్ నారాయణ భరత్‌గుప్తా పిలుపునిచ్చారు. కలెక్టర్ పట్రపల్లెకు చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. వి.కోట వ్యవసాయ మార్కెట్‌ను తాత్కాలికంగా మూసివేసి ఇక్కడి లావాదేవీలను కుప్పం మార్కెట్ నుండీ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. కరోనా కేసులు నమోదైన పట్రపల్లె, వి.కోట మార్కెట్‌యార్డుతో పాటు పట్టణంలోని కేజీఎఫ్ రోడ్డును, నారాయణ్‌నగర్‌లను రెడ్ జోన్‌లుగా జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అలాగే వి.కోటను కటైన్‌మెంట్ ఏరియాగా గుర్తించారు.
కోయంబేడు బంధంపై ప్రత్యేక దృష్టి : ఎస్పీ సెంథిల్‌కుమార్
జిల్లా వ్యాప్తంగా చెన్సై కోయంబేడు మార్కెట్‌కు వెళ్ళి వచ్చే వారి పై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్ తెలిపారు. వి.కోటతో పాటు మదనపల్లె, నగరి, సత్యవేడు, పుత్తూరు నుండీ తరచూ కూరగాయలను చెన్నైకు తరలిస్తుంటారని వారిలో రెగ్యులర్‌గా వెళ్లి వచ్చే వారిని వంద మందిని గుర్తించి ఐసోలేట్ చేశామాన్నరు. అలాగే మార్కెట్‌తో సంభందాలున్న వ్యాపారులు, రైతులు, డ్రైవర్లు తదితరులు ముందు జాగ్రత్తగా స్వచ్చంగా పరీక్షలు చేసుకుంటే తదుపరి కరోనా వ్యాపించ కుండా నివారించుకోవచ్చని కోరారు.
వి.కోట ఆసుపత్రిలోనే ట్రూనాట్ పరీక్షలు: డీఎంహెచ్‌వో
వి.కోటలో కరోనా కేసులు బయటపడటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి పెంచలయ్య తెలిపారు. ఆక్కడ కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నందున వి.కోట ఏరియా ఆసుపత్రిలో ట్రానాట్ పరీక్షల నిమిత్తం కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. మార్కెట్‌తో సంభందాలున్న వారు స్వయంగా ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేసుకోవాలని కోరారు. కలెక్టర్ వెంట ఎమ్మేల్యే వెంకటేగౌడ, మదనపల్లె సబ్ కలెక్టర్ కీర్తీచేకూరి, తహసిల్దార్ మురళీధర్, పపమనేరు డీఎస్పీ ఆరీపుల్లా, అర్భన్ సీఐ యతీంద్ర, ఎసై మహేష్‌బాబు, ఎంపీడీవో బాలాజీ, వైధాధికారులు డా. రాజేష్‌నాయక్, ఈవో యాదాపతి ఇతర అధికారులు ఉన్నారు.
Updated Date - 2020-05-09T09:00:35+05:30 IST