ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి : రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు

ABN, First Publish Date - 2020-07-12T00:29:17+05:30

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. రోజూ వేలసంఖ్యలో కొత్త కేసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. రోజూ వేలసంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండగా, మరణాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా తిరుపతిలో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 172 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నమోదైన కేసుల్లో తిరుపతి అర్బన్ 144, రూరల్ 28 కేసులు నమోదవ్వడం జిల్లా వాసులను ఆందోళన కలిగిస్తోంది.


ఇక చిత్తూరు జిల్లా విషయానికొస్తే.. కొత్తగా 300 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపితే జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 2509కు చేరుకుంది. ఇప్పటి వరకూ 1126 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా ప్రస్తుతం 1364 మంది మాత్రమే జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మరణాల సంఖ్య జిల్లాలో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకూ కరోనాతో 19 మంది జిల్లా వ్యాప్తంగా మృతి చెందారు.


ఇదిలా ఉంటే.. శనివారం నాడు కేసులతో పాటు మరణాలు కూడా పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే కరోనాతో 17 మంది చనిపోయారంటే... కోవిడ్ ఉధృతి రాష్ట్రంలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గడిచిన 24 గంటల్లో ఏపీలో 1813 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు వచ్చిన కేసులతో కలిపి మొత్తం 27,235 మందికి రాష్ట్రంలో కరోనా సోకింది. కరోనా నుంచి కోలుకున్న14,393 మంది డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం 12,533 యాక్టివ్ కేసులన్నాయి.

Updated Date - 2020-07-12T00:29:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising