సీఎం హామీ లేనిదే ప్రకటించలేం
ABN, First Publish Date - 2020-11-13T07:03:41+05:30
సీఎం జగన్ హామీ లేనిదే..మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేస్తామని ప్రకటించలేమంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నిస్సహాయత వ్యక్తం చేశారు.
మదనపల్లె జిల్లా కేంద్రంపై డిప్యూటీ సీఎం
మదనపల్లె, నవంబరు 12: సీఎం జగన్ హామీ లేనిదే..మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేస్తామని ప్రకటించలేమంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నిస్సహాయత వ్యక్తం చేశారు.గురువారం మదనపల్లెలో ఎమ్మెల్యే నవాజ్‌బాషా పాదయాత్ర ముగింపు సభలో ఆయన ప్రసంగిస్తుండగా, పక్కనే ఉన్న చిత్తూరు ఎంపీ ఎన్.రెడ్డెప్ప..మదనపల్లె జిల్లా కేంద్రంపై ప్రకటన చేయాలని సూచించారు. అయితే అధినేత హామీ లేనిదే చెప్పలేమన్న నారాయణస్వామి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మదనపల్లె, రాయచోటి, రాజంపేట కేంద్రాలకు అనుకూలంగా ఉండేవిధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడు మాట ఇస్తే, తర్వాత అది సాధ్యం కాకపోతే ప్రజలు రాళ్లతో కొడతారని, రెడ్డెప్పన్న నన్ను ఇరికించే ప్రయత్నం చేశారని తప్పుబట్టారు.
Updated Date - 2020-11-13T07:03:41+05:30 IST