కొవిడ్ కేంద్రాలు మూత
ABN, First Publish Date - 2020-12-11T05:59:15+05:30
పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో తిరుపతిలోని రుయా, స్విమ్స్‌లోని కొవిడ్ ఆస్పత్రులు, పద్మావతి కొవిడ్ కేర్ సెంటర్ మినహా మిగిలినచోట్ల కొవిడ్ కేంద్రాలు మూతపడుతున్నాయి.
రుయా, స్విమ్స్‌లోని కొవిడ్ ఆస్పత్రులు,
పద్మావతి కొవిడ్ కేర్ సెంటర్ కొనసాగింపు
కరోనా నిర్ధారణ పరీక్షలు,
ట్రయాజ్ సెంటర్లు యథాతథం
అందుబాటులోకి సాధారణ వైద్యం
చిత్తూరు రూరల్, డిసెంబరు 10: కరోనా కారణంగా అన్ని ఆస్పత్రుల్లోనూ సాధారణ ఓపీలు, శస్త్రచికిత్సలు నిలిపేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో తిరుపతిలోని రుయా, స్విమ్స్‌లోని కొవిడ్ ఆస్పత్రులు, పద్మావతి కొవిడ్ కేర్ సెంటర్ మినహా మిగిలినచోట్ల కొవిడ్ కేంద్రాలు మూతపడుతున్నాయి. ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీల్లో కొవిడ్ బాధితుల కోసం కేటాయించిన కేంద్రాలను మూతవేస్తున్నట్లు అధికారులూ ప్రకటించారు. దాంతో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలోనూ కొవిడ్ సేవలు ఆపేసి.. సాధారణ వైద్యసేవలు ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు. కొవిడ్ కేంద్రాలు మూతవేసినా.. కరోనా నిర్ధారణ పరీక్షలు, బాధితులకు మందులు, సలహాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ట్రయాజ్ సెంటర్లు కొనసాగనున్నాయి.
ఇంటి వద్దనే చికిత్స
ఒకవేళ ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే.. ఇంటి వద్దనే చికిత్స తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇంటి వద్ద సౌకర్యం లేని వారిని తిరుపతిలోని పద్మావతి కొవిడ్ కేర్ సెంటర్‌కు, సీరియన్ కేసులను రుయా, స్విమ్స్ కొవిడ్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. కాగా.. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో 450 బెడ్లతో ఏర్పాటు చేసిన కొవిడ్ ఐసొలేషన్ వార్డులో 36,943 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 2,876 మందికి చికిత్స అందించగా.. 57 మంది మృతి చెందారు. 2,632 మంది ఆరోగ్యవంతులుగా డిశ్చార్జి అయ్యారు. 7,948 మందికి ట్రయాజ్ సెంటర్ ద్వారా మందులు పంపిణీ చేశారు.
అన్ని రకాల వైద్యసేవలు, సర్జరీలు ప్రారంభిస్తున్నాం
కరోనా కారణంగా ఆగిన అన్నిరకాల వైద్యసేవలు, సర్జరీలు ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చాం. ప్రజలు సద్వినియోగం చేసుకోవచ్చు.
30 సర్జరీలు చేశాం
ఈనెల ఏడో తేదీనుంచి సర్జరీలు మొదలు పెట్టాం. ఇప్పటి వరకు 30 ఆపరేషన్లు చేశాం. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో సర్జరీలు చేయనున్నాం.
Updated Date - 2020-12-11T05:59:15+05:30 IST