ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం పర్యటనలో స్వల్ప మార్పులు

ABN, First Publish Date - 2020-09-23T10:19:46+05:30

తిరుమల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించేందుకు సీఎం జగన్‌ బుధవారం తిరుమల రానున్నారు. రెండురోజుల ఈ పర్యటనకు సంబంధించి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ నుంచి నేరుగా తిరుమలకు

సాయంత్రం శ్రీవారికి పట్టువస్ర్తాల సమర్పణ


చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 22:తిరుమల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించేందుకు సీఎం జగన్‌ బుధవారం తిరుమల రానున్నారు. రెండురోజుల ఈ పర్యటనకు సంబంధించి మంగళవారం రాత్రి స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ప్రకటించినట్లు బుధవారం మధ్యాహ్నం 3.50 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకోవాల్సిన సీఎం మారిన షెడ్యూల్‌ మేరకు ఢిల్లీ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకే రానున్నారు.


అక్కడ అధికార, అనధికారులతో పది నిమిషాలు మాట్లాడిన అనంతరం 1.10 గంటలకు తిరుమలకు బయలుదేరి వెళతారు. 2.10 గంటలకు పద్మావతి అతిథి గృహానికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 5.27 గంటలకు అతిథి గృహం నుంచి బయలుదేరి అన్నమయ్య భవనం వద్దకు చేరుకుంటారు. 5.30గంటల నుంచి 6 గంటల వరకు అక్కడ నుంచి జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. 6.10 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు.


అనంతరం సంప్రదాయ వస్త్రధారణలో శ్రీవారికి సమర్పించే సారెను తీసుకుని  6.40 గంటలకు మహద్వారం గుండా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశిస్తారు.6.55 నుంచి 7.05 గంటల మధ్య స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.అనంతరం వకుళమాతను దర్శించుకుని విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణలు చేసి రంగనాయక మండపానికి చేరుకుంటారు. అక్కడ వేద ఆశీర్వచనాలు తీసుకుంటారు. 7.30 గంటల నుంచి 7.35 గంటల వరకు సంపంగి ప్రాకారంలో నిర్వహించనున్న గరుడవాహన సేవలో పాల్గొంటారు.


గురువారం ఉదయం 6.15 గంటలకు మరోసారి శ్రీవారిని దర్శించుకుంటారు.7 గంటలకు నాద నీరాజనం వేదికపై నిర్వహించనున్న సుందరకాండ పారాయణంలో పాల్గొంటారు. 8.10 గంటలకు కర్ణాటక సత్రాల భవన నిర్మాణ భూమి పూజలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్పతో కలసి పాల్గొంటారు. 8.25 గంటలకు అతిథి గృహానికి చేరుకుని కర్ణాటక సీఎంతో కలిసి అల్పాహారం సేవిస్తారు. 9.20 గంటలకు అతిథి గృహం నుంచి బయలుదేరి 10.20 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి విమానంలో గన్నవరం బయలుదేరి వెళతారు.

Updated Date - 2020-09-23T10:19:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising