చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్‌గుప్తాకు కరోనా
ABN, First Publish Date - 2020-09-18T16:42:40+05:30
కలెక్టర్ భరత్‌గుప్తాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల ఆయన వ్యక్తిగత పనుల మీద.
చిత్తూరు(ఆంధ్రజ్యోతి): కలెక్టర్ భరత్‌గుప్తాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల ఆయన వ్యక్తిగత పనుల మీద రెండ్రోజుల సెలవులో విజయవాడ వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. గురువారం ఆయనకు లక్షణాలు ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్ రావడంతో పది రోజులపాటు తిరుపతిలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోనే హోమ్ ఐసొలేషన్‌లో ఉంటారు. మళ్లీ నెగెటివ్ వచ్చేవరకు ఎవ్వరూ తనను కలవద్దని ఆయన జిల్లా అధికారులకు సందేశం పంపించారు.
Updated Date - 2020-09-18T16:42:40+05:30 IST