ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హలో.. ఆరోగ్యమెలా ఉంది?

ABN, First Publish Date - 2020-08-03T10:35:20+05:30

హలో.. మీ ఆరోగ్యం ఎలా ఉంది.. సరైన వైద్యం అందుతోందా.. సరైన వసతులు ఉన్నాయా? అంటూ ప్రభుత్వ విప్‌, తిరుపతిలో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా బాధితులకు చెవిరెడ్డి ఫోన్‌


తిరుచానూరు. ఆగస్టు 2: హలో.. మీ ఆరోగ్యం ఎలా ఉంది.. సరైన వైద్యం అందుతోందా.. సరైన వసతులు ఉన్నాయా? అంటూ ప్రభుత్వ విప్‌, తిరుపతిలో ఏర్పాటైన కొవిడ్‌ సమన్వయ కమిటీ చైర్మన్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి కరోనా బాధితులకు ఫోన్‌చేసి ఆరాతీశారు. శిల్పారామం కేంద్రంగా ఏర్పాటైన సెంట్రల్‌ రిసెప్షన్‌ నుంచి తిరుపతి పరిధిలోని వివిధ క్వారంటైన్‌ సెంటర్లతోపాటు హోమ్‌ ఐసొలేషన్‌లోని కరోనా బాధితులతో చెవిరెడ్డి మాట్లాడారు. ఏవైనా ఇబ్బందులుంటే శిల్పారామంలోని కాల్‌సెంటర్‌కు ఏ సమయంలోనైనా ఫోన్‌ చేయొచ్చని సూచించారు. దీనిపై పలువురు బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదని.. ఇపుడీ సెంటర్‌ ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. అంతకుముందు సమన్వయ కమిటీ సభ్యులతో చెవిరెడ్డి సమీక్షించారు. బాధితుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌పై సానుకూలంగా స్పందించి, సమాధానం ఇవ్వాలని చెప్పారు. అనంతరం టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను ఆయన బంగ్లాలో కలిసి తమ కమిటీ సేవలను వివరించారు. దీనికి టీటీడీ నుంచి సహకారం ఇవ్వాలని కోరారు. సమన్వయ కమిటీ సభ్యులు, వైద్యులు మురళీకృష్ణ, అరుణసులోచన, కృష్ణప్రశాంతి, రవిరాజు, యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-03T10:35:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising