శ్రీవారి ఆలయం లైటింగ్‌లో మార్పు
ABN, First Publish Date - 2020-12-31T04:40:22+05:30
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయానికి ఏర్పాటు చేసిన లైటింగ్‌లో బుధవారం మార్పులు చేశారు.
ప్రాకారానికి మార్చిన లైటింగ్
తిరుమల, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయానికి ఏర్పాటు చేసిన లైటింగ్‌లో బుధవారం మార్పులు చేశారు. పూర్ణకుంభం లైటింగ్.. శిలువ గుర్తులా ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీనిని టీటీడీ అధికారులు ఖండిస్తూ టీటీడీపై దుష్ప్రచారానికి పాల్పడిన వారిపై కేసులు పెట్టినట్టు తెలిపారు. అలాగే పూర్ణకుంభాల లైటింగ్‌ను తొలగించి అదే స్థానంలో పూర్ణకుంభాలు స్పష్టంగా తెలిసేలా నూతన లైటింగ్ ఏర్పాటు చేశారు.
Updated Date - 2020-12-31T04:40:22+05:30 IST