ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడుగడుగునా అడ్డంకులే..!

ABN, First Publish Date - 2020-10-03T18:13:00+05:30

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళితులపై పెరిగిపోతున్న దాడులను నిరసిస్తూ దళిత సంఘాలు, వామపక్షాలు, టీడీపీ పిలుపు మేరకు శుక్రవారం జరగాల్సిన ఛలో మదనపల్లె కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. దానికోసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చలో మదనపల్లె కార్యక్రమాన్ని భగ్నం చేసిన పోలీసులు

ఎక్కడికక్కడ టీడీపీ, వామపక్షాలు, దళిత సంఘాల నేతల అరెస్టులు... గృహ నిర్బంధాలు


మదనపల్లె/తిరుపతి (ఆంధ్రజ్యోతి):  వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళితులపై పెరిగిపోతున్న దాడులను నిరసిస్తూ దళిత సంఘాలు, వామపక్షాలు, టీడీపీ పిలుపు మేరకు శుక్రవారం జరగాల్సిన ఛలో మదనపల్లె కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. దానికోసం జిల్లావ్యాప్తంగా టీడీపీ, వామపక్షాలు, దళిత సంఘాల నేతలను అడ్డుకోవడం, అరెస్టు చేయడం, గృహ నిర్బంధానికి గురి చేయడం వంటి చర్యలకు దిగారు. దీంతో పలు చోట్ల నుంచీ మదనపల్లెకు బయల్దేరిన ఆయా పక్షాలకు చెందిన నాయకులు నిర్బంధాలకు లోనై సకాలంలో మదనపల్లె చేరుకోలేకపోయారు. 


ఛలో మదనపల్లె కార్యక్రమంలో  పాల్గొనేందుకు గురువారం రాత్రే తిరుపతి చేరుకున్న న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ స్థానిక గ్రాండ్‌ రిడ్జ్‌ హోటల్‌లో దిగారు. శుక్రవారం ఉదయం ఆయన్ను కలసి మదనపల్లె తీసుకెళ్ళేందుకు జడ్జి రామకృష్ణ అక్కడికి వెళ్ళారు. సత్యవేడు టీడీపీ ఇన్‌ఛార్జి జేడీ రాజశేఖర్‌తో పాటు వారిద్దరూ కలసి మదనపల్లె వెళ్ళేందుకు బయల్దేరుతుండగా అప్పటికే హోటల్‌ను భారీ సంఖ్యలో చుట్టుముట్టిన పోలీసులు వారిని వెలుపలికి రాకుండా అడ్డుకున్నారు. అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు కూడా హోటల్‌ వద్దకు చేరుకుని అడ్డుగా బ్యారికేడ్లు ఏర్పాటు చేయించి రాకపోకలను పూర్తిగా అడ్డుకున్నారు. ఈలోపు సమాచారమందు కున్న మాజీ మంత్రి పరసా రత్నం, తుడా మాజీ ఛైర్మన్‌ నరసింహయాదవ్‌ సహా టీడీపీ నేతలు ఆర్‌సీ మునికృష్ణ, శ్రీధరవర్మ, దళిత సంఘాల నేతలు హోటల్‌ ఎదుటకు చేరుకుని ఆందోళనకు దిగారు. మరోవైపు రిపబ్లికన్‌ పార్టీ సహా దళిత సంఘాల నేతలు ఆర్టీసీ బస్టాండు ఎదుట అంబేడ్కర్‌ విగ్రహం కూడలిలో ధర్నా చేపట్టారు. దీంతో తిరుపతిలో ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు మధ్యాహ్నం 2 గంటల తర్వాత పోలీసులు జడ్జి రామకృష్ణ, న్యాయవాది శ్రావణ్‌కుమార్‌లను హోటల్‌ నుంచీ వెలుపలికి వెళ్ళనిచ్చారు.అప్పటికే మదనపల్లెలో నిరసన కార్యక్రమానికి సమయం దాటిపోవడంతో వారిద్దరూ మీడియాతో మాట్లాడిన అనంతరం మదనపల్లె బయల్దేరి వెళ్ళారు.


మదనపల్లెలో ఆందోళనకారుల అరెస్టు

మదనపల్లెలో సీపీఐ, బీఎస్‌పీ, మాలమహానాడులకు చెందిన ఆందోళన కారులు ఉదయం ఆర్టీసీ బస్టాండు సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం కూడలికి చేరుకుని నిరసన ప్రదర్శన నిర్వహిస్తుండగా పెద్దఎత్తున పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. ఆందోళనకారులను అక్కడ నుంచీ చెదరగొట్టాయి. 30 మందిని అరెస్టు చేసి టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేస్తూ స్టేషన్‌లో బైఠాయించారు. డీఎస్పీ రవి మనోహరాచారి అక్కడకు చేరుకుని వారితో చర్చించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించేందుకు అనుమతించారు. ఆపై సబ్‌ కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్ళేందుకు ఆందోళనకారులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.


తర్వాత పోలీసులే వారిని వాహనాల్లో సబ్‌ కలెక్టరేట్‌ కు చేర్చారు. సబ్‌ కలెక్టరేట్‌ ప్రాంగణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చిన ఆందోళనకారులు దళితుల పై దాడులను అడ్డుకోవాలని కోరుతూ సబ్‌ కలెక్టర్‌ జాహ్నవికి వినతి పత్రం అందజేశారు. తర్వాత పోలీసులు వారిని ఇళ్ళ వద్ద విడిచిపెట్టారు. మరోవైపు అంబేడ్కర్‌ కూడలి వద్దకు నిరసనకారులు, ఆందోళనకారులు చేరకుండా పోలీసులు భారీగా మొహరించారు. కాగా సాయంత్రం 6గంటల సమయంలో మద నపల్లె చేరుకున్న న్యాయవాది శ్రావణ్‌కుమార్‌, జడ్జి రామకృష్ణ, రిటైర్డ్‌ జడ్జి గుర్రప్ప తదితరులు అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు వచ్చి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రావణ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ మదనపల్లె నుంచీ దళిత ఉద్యమం ప్రారంభిస్తున్నామని  ప్రకటించారు. మంత్రి పెద్దిరెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు.2024కు దళిత సీఎం లక్ష్యంగా కార్యాచరణ కు దిగుతున్నామని ప్రకటించారు.దళితులపై దాడులను ఎదుర్కొ నేందుకు ఛలో మదనపల్లె కార్యక్రమానికి పిలుపిస్తే పోలీసులు వాహ నాలను అడ్డుకోవడం,గృహ నిర్బంధాలలో వుంచడం చేశారని ఆరోపిం చారు. అనంతరం వారు జడ్జి రామకృష్ణ సోదరుడు, ఇటీవల ప్రత్యర్థుల దాడిలో గాయపడిన రామచంద్రను పరామర్శించేందుకు బి.కొత్తకోట వెళ్ళారు.


 పలుచోట్ల పోలీసు నిర్బంధాలు

 బి.కొత్తకోటలో టీడీపీ నేత, మహిళా కమిషన్‌ మాజీ సభ్యురాలు పర్వీన్‌ తాజ్‌ ఛలో మదనపల్లె కార్యక్రమంలో పాల్గొనేందుకు బయల్దేరుతుండగా పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.శ్రీకాళహస్తిలో సీపీఐ నేత గురవయ్య సహా ఆ పార్టీ నేతలు శివకుమార్‌, వినోద్‌, సీపీఎం మణి, సురేష్‌, గోపీలను గురవయ్య ఇంటి వద్దే పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. మదనపల్లెకు వెళ్ళకుండా వారిని అక్కడే గృహ నిర్బంధంలో వుంచారు. పుత్తూరులో సీపీఎం నేత వెంకటేశు, సీపీఐ నేత మహేశులతో సహా మొత్తం 9 మందిని గురువారం రాత్రే పోలీసులు గృహ నిర్బంధంలో వుంచారు. శుక్రవారం ఉదయం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు.మధ్యాహ్నం తర్వాత బైండోవర్‌ చేసుకు ని విడిచిపెట్టారు.పిచ్చాటూరులో టీడీపీ నాయకులు ఛలో మదనపల్లె కార్యక్రమంలో పాల్గొనేందుకు వాహనంలో బయల్దేరుతుండగా పోలీసులు అదుపులోకి స్టేషన్‌కు తరలించారు. మధ్యాహ్నం తర్వాత విడిచిపెట్టారు.చిత్తూరులో గాంధీ విగ్రహ కూడలిలో సీపీఐ నాగరాజన్‌, సీపీఎం చైతన్యల ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా దళితులపై దాడులను ఖండించారు. గుడిపాల మండల టీడీపీ అధ్యక్షుడు కమలేష్‌ బాబు, ఎస్సీసెల్‌ అధ్య క్షుడు పీటర్‌ కార్యకర్తలతో పాటు వాహనాల్లో మదనపల్లె వెళుతుండగా నరహరిపేట చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం తర్వాత వారిని విడిచిపెట్టారు.పలమనేరులో టీడీపీ ఎస్సీ సెల్‌ నాయకుడు నాగరాజు, సీపీఎం డివిజన్‌ కార్యదర్శి ఓబుల్‌రాజులను మదనపల్లె వెళ్ళకుండా పోలీసులు గృహ నిర్బంధంలో వుంచారు.


రామకృష్ణ కుటుంబం ఒంటరి కాదు : శ్రావణ్‌

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఆ పార్టీ నాయకులు 70 ఏళ్లకు సరిపడేలా దళితులపై దాడులు చేశారని న్యాయవాది శ్రావణ్‌ కుమార్‌ ధ్వజమెత్తారు.తిరుపతిలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితుల మీద దారుణాలతో పాటు పట్టణాల్లో మేధావులపై దాడులను సమాజం మరిచిపోదన్నారు. డాక్టర్‌ సుధాకర్‌ నుంచి జడ్జి రామకృష్ణ వరకు  సమాజం చీదరించుకునే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంద న్నారు.జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రపై దాడిచేసిన నిందితు లను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దళిత జాతి మొత్తంగా ఏకం కాబోతోందన్న సంకేతాలను ఛలో మదనపల్లె ద్వారా ఇచ్నామ న్నారు. రామకృష్ణ కుటుంబం ఒంటరి కాదని అంబేడ్కర్‌ వారసులు నిరూపించారన్నారు.అసభ్య పదజాలంతో దళితులను మాట్లాడితే నీ పదవి పోయేలా చేస్తామంటూ మంత్రి పెద్దిరెడ్డిని హెచ్చరించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామన్నారు.అనంతరం జడ్జి రామకృష్ణ మాట్లాడుతూ రెండు రోజులుగా ఎక్కడివారిని అక్కడ అరెస్ట్‌ చేసి ఉక్కుపాదంతో తొక్కాలని చూస్తున్నారన్నారు. దళిత జాతిలో ఉన్న సంఘీబావం బయటపడిందన్నారు. దళితజాతి ఉద్యమంలో తాను కూడా క్రియాశీలకంగా పాల్గొంటానన్నారు.

Updated Date - 2020-10-03T18:13:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising