ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైళ్ల రాకపోకలు రద్దు

ABN, First Publish Date - 2020-03-23T10:17:55+05:30

జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం కలికిరి మీదుగా వెళ్ళే పలు రైళ్ళను రద్దు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అర్ధంతరంగా రద్దయిన మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌


కలికిరి, మార్చి 22:  జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం కలికిరి మీదుగా వెళ్ళే పలు రైళ్ళను రద్దు చేశారు. మార్గమధ్యంలో వున్న వున్న రైళ్ళకు మినహాయింపు ఇచ్చినప్పటికీ మచిలీపట్నం-ధర్మవరం మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైలును కూడా అర్ధంతరంగా రద్దు చేశారు. ఇది మచిలీపట్నం నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి విజయవాడ, తిరుపతి, కలికిరి మీదుగా ధర్మవరంకు ఆదివారం 11 గంటలకు చేరాల్సి వుంది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు చార్ట్‌ తయారు సమయంలో కూడా రైలు రద్దు కాలేదు. అంతేగాక ఈ రైలు కోసం వెయిటింగ్‌ జాబితాలో వున్న వారికి శనివారం సాయంత్రం సీట్ల కన్ఫర్మేషన్‌ సందేశాలు కూడా పంపారు. అయితే మచిలీపట్నంలో రైలు బయలుదేరాల్సిన రెండు గంటల ముందు మాత్రమే రద్దు చేయాలని నిర్ణయించారు.


అనంతరం సాయంత్రం నాలుగు గంటల తరువాత రైలు రద్దయినట్లు ప్రయాణికులకు సందేశాలు పంపారు. విజయవాడలో శనివారం మధ్యాహ్నం ఒక కరోనా పాజిటివ్‌ సంఘటన బయట పడటంతో ఆందోళన చెందిన రైల్వే వర్గాలు ఈ రైలును అర్ధంతరంగా రద్దు చేసినట్లు తెలిసింది. ఇక కలికిరి మీదుగా వెళ్ళాల్సిన ప్యాసింజరు రైళ్ళన్నంటినీ కూడా కర్ఫ్యూ దృష్ట్యా రద్దు చేశారు. 

Updated Date - 2020-03-23T10:17:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising