ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వర్ణముఖిలోని ఇసుక రీచ్‌లను రద్దు చేయండి

ABN, First Publish Date - 2020-07-12T11:13:44+05:30

స్వర్ణముఖి నదీ పరీవాహక ప్రాంతంలోని ఇసుక రీచ్‌లను రద్దుచేయాలని నదీ పరిరక్షణ సమితి కన్వీనర్లు మురిగప్ప మొదిలియర్‌,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నదీ పరిరక్షణ సమితి డిమాండ్‌ 


తిరుపతి(తిలక్‌రోడ్డు), జూలై 11: స్వర్ణముఖి నదీ పరీవాహక ప్రాంతంలోని ఇసుక రీచ్‌లను రద్దుచేయాలని నదీ పరిరక్షణ సమితి కన్వీనర్లు మురిగప్ప మొదిలియర్‌, రంగయ్యనాయు డు, చిన్నదొరస్వామి డిమాండు చేశారు. తిరుపతిలోని శ్రీదేవి కాంప్లెక్స్‌ ఆవరణలో శనివారం ఏర్పేడు మండలానికి చెందిన రైతులు ఇసుక ప్యాకెట్లను నెత్తిన పెట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం ప్రెస్‌క్లబ్‌లో వీరు మాట్లాడుతూ.. మోదుగులపాళెం, మడిబాక రీచుల్లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు.


ఈ రీచ్‌లను రద్దు చేస్తానని ప్రతిపక్ష నేతగా చెప్పిన జగన్‌.. మళ్లీ అక్కడే ఇసుక రీచ్‌లను పెట్టి, వైసీపీ నాయకులే ఇసుకను దోచేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మాజీ ఎంపీ, సినీనటుడు మోహన్‌బాబు కూడా ఇసుక అక్రమ రవాణాపై స్పందించి రైతులకు మద్దతివ్వాలని కోరారు. సోమశిల- స్వర్ణముఖి కాలువ నమూనాను మోదుగుల పాళెం మడిబాక, వీరపురం, గ్రామాల పైభాగంలో నిర్మించేలా మార్చాలన్నారు. ఈ సమావేశంలో ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి ఆర్‌.హరికృష్ణ, అఖిల భారత రైతు కూలీల సంఘం అధ్యక్షుడు ఆర్‌.వెంకయ్య, వెంకటరత్నం, బత్తెయ్యనాయుడు, బాధిత రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-12T11:13:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising