ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉచిత బోర్ల మంజూరుకు దరఖాస్తులు

ABN, First Publish Date - 2020-07-06T11:06:33+05:30

వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం రైతులకు ఉచిత బోర్ల మంజూరుకు చర్యలు చేపట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, జూలై 5: వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం రైతులకు ఉచిత బోర్ల మంజూరుకు చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి శనివారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నుంచి జిల్లా యంత్రాంగానికి జీవో నెం.64 పేరిట ఉత్తర్వులందాయి. అర్హులకు ప్రభుత్వమే ఉచితంగా బోర్లను తవ్వించి పైపులు, మోటరు, విద్యుత్తు కనెక్షన్‌ అమర్చి సహకరిస్తుంది.


ఐదెకరాలు సాగులో ఉండి, బోరులేని రైతులు ఈ పథకానికి అర్హులు. 2.5 ఎకరాల భూమి కలిగిన ఇద్దరు లేదా ముగ్గురు చిన్న, సన్నకారు రైతులు సంయుక్తంగానూ దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక గ్రామ సచివాలయం లేదా రైతుభరోసా కేంద్రాల్లో దరఖాస్తులకు పట్టాదారు పాసుబుక్కు, ఆధార్‌కార్డు జిరాక్స్‌పత్రాలను రైతులు అందజేయాల్సి ఉంది. ఎంపికైన అర్హుల సెల్‌ఫోన్‌కు అధికారులు సమాచారం అందజేశారు. అనంతరం జియాలజిస్టులు నీటిలభ్యతపై నివేదిక అందజేయగానే, ఆయా రైతుల పొలాల్లో మండల పరిషత్‌ అధికారులు ఉచితంగా బోర్ల తవ్వకం పనులు పూర్తి చేయిస్తారు. 

Updated Date - 2020-07-06T11:06:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising