ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగమోక్తంగా అష్టోత్తర శత కలశాభిషేకం

ABN, First Publish Date - 2020-12-15T05:37:16+05:30

శ్రీకాళహస్తీశ్వరాలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం పూజలు

ముక్కంటి ఆలయంలో కలశ పూజలు చేస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, డిసెంబరు 14: శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం అష్టోత్తర శత  కలశాభిషేకం పూజలు ఆగమోక్తంగా జరిగాయి. కార్తీక మాసోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 4వతేదీ నుంచి అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లకు లక్ష బిల్వ, లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఆదివారంతో ఈ పూజలు ముగియడంతో సోమవారం అష్టోత్తర శత కలశాభిషేకం చేశారు. తొలుత స్వామివారి గర్భాలయం ముందు కలశాలు స్థాపించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమపూజలు చేసి పూర్ణాహుతి సమర్పించారు. అన్నం కుంభం వేశారు. కలశాలకు ఆఖండ హారతి సమర్పించారు. తర్వాత కలశాలను ఆలయంలో ఊరేగించి స్వామి, అమ్మవార్ల మూలవిరాట్లకు కలశ జలంతో అభిషేకం, పూజలు చేశారు. కుంభం వేసిన నైవేద్యాన్ని భక్తులకు పంపిణీ చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల అర్చనకు ఉపయోగించిన బిల్వపత్రాలు, కుంకుమతో మంగళ వాయిద్యాలు, మేళ తాళాల మధ్య ఊరేగింపుగా ఆలయం నుంచి దక్షిణ గాలిగోపురం మీదుగా సన్నిధివీధి నుంచి స్వర్ణముఖినదిలోని స్నానపు ఘట్టాల వద్దకు చేరుకున్నారు. ఇక్కడ బిల్వ, కుంకుమ పూజా సామగ్రికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత పసుపు, కుంకుమను స్వర్ణముఖి నదిలో కలిపి నదీమ తల్లి హారతి సమర్పించారు. అనంతరం బిల్వ, కుంకుమ పూజా సామగ్రిని నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈవో హేమమాలిని, ఆలయ ఇన్స్‌పెక్టరు సుదర్శన్‌, విజయసారథి, సంబంధం గురుకుల్‌, కరుణాస్వామి తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2020-12-15T05:37:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising