ఆరుగురు తహసీల్దార్ల బదిలీ
ABN, First Publish Date - 2020-02-05T23:04:45+05:30
జిల్లాలో ఇటీవల కొందరు తహసీల్దార్ల పదవీ విరమణతో ఏర్పడ్డ ఖాళీల్లో తహసీల్దార్లను నియమిస్తూ మంగళవారం కలెక్టర్ నారాయణ్ భరత్‌గుప్తా..
చిత్తూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 4: జిల్లాలో ఇటీవల కొందరు తహసీల్దార్ల పదవీ విరమణతో ఏర్పడ్డ ఖాళీల్లో తహసీల్దార్లను నియమిస్తూ మంగళవారం కలెక్టర్ నారాయణ్ భరత్‌గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటేషన్‌పై కలెక్టరేట్‌లో పని చేస్తున్న సోమల తహసీల్దార్ బి. హనుమాన్ నాయక్‌ను నారాయణవనానికి, కలకడ నుంచి బి.పార్వతిని శాంతిపురానికి బదిలీ చేశారు. కలెక్టరేట్‌లో బి.సెక్షన్ సూపరింటెండెంట్ యు. మధుసూదన్‌రావును ఆర్‌సీ పురానికి, బి. కొత్తకోట తహసీల్దార్ కె. గణేష్‌ను బీఎన్ కండ్రిగకు, వి. సురేష్‌ను శాంతిపురం నుంచి కుప్పంకు బదిలీ చేశారు. బీఎన్‌కండ్రిగలో పని చేస్తున్న చంద్రశేఖర్‌రెడ్డిని విజయవాడ హైకోర్టుకు జిల్లా లైజన్ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. వీరందరు వెంటనే విధుల్లో చేరాలని కలెక్టర్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
Updated Date - 2020-02-05T23:04:45+05:30 IST