ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

682 సారా ప్యాకెట్ల స్వాధీనం

ABN, First Publish Date - 2020-03-31T12:21:02+05:30

సారా తరలిస్తున్న ముగ్గురు నిందితులను చిత్తూరు అర్బన్‌, రూరల్‌ ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముగ్గురు నిందితుల అరెస్టు


చిత్తూరు సిటీ, మార్చి 30: సారా తరలిస్తున్న ముగ్గురు నిందితులను చిత్తూరు అర్బన్‌, రూరల్‌ ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సోమవారం 682 సారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నగర శివారులోని చిత్తూరు-వేలూరు రహదారిలోని రెడ్డిగుంట వద్ద అర్బన్‌ సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ రవికుమార్‌లు వాహనాల తనిఖీ నిర్వహించారు. చిత్తూరుకు చెందిన సాదిక్‌ బాషా, ఖాదర్‌ బాషా రెండు ద్విచక్రవాహనాల్లో వస్తుండగా ఆపారు. తనిఖీ చేయగా.. వీరివద్ద 600 సారా ప్యాకెట్లు కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు.


వాహనాలు, సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే చిత్తూరు రూరల్‌ సీఐ లావణ్య తన సిబ్బందితో బంగారుపాళ్యం మండలం వేపనపల్లె క్రాస్‌వద్ద తనిఖీలు చేశారు. పలమనేరు మండలం గొబ్బిళ్లకోటూరుకు చెందిన లక్ష్మీరెడ్డి, రామమూర్తి ద్విచక్రవాహనంలో వస్తుండగా ఆపారు. తనిఖీలో వీరివద్ద 82 సారా ప్యాకెట్లు ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. వాహనం, సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-03-31T12:21:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising