ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బొమ్మలా.. బాలికలా?

ABN, First Publish Date - 2020-12-15T09:16:42+05:30

ఎన్ని సంస్కరణలు, ఎన్నెన్ని చైతన్య పథకాలు తెచ్చినా రాష్ట్రంలో బాల్య వివాహాలు ఆగడం లేదు. బొమ్మలకు పెళ్లిళ్లు చేసే వయసులోనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలో 29.3 శాతం బాల్య వివాహాలు

కాన్పుకెళితే కోతపెడుతున్న ఆస్పత్రులు

2019-20లో 42.4% సిజేరియన్లే

అక్కర్లేకున్నా 63శాతం మందికి కోతలు

కండోమ్‌పై స్ర్తీ, పురుషుల్లో అవగాహన

వారికి ఎయిడ్స్‌ అంటే తెలియని వైనం

కేంద్ర ఆరోగ్య సర్వే నివేదికలో వెల్లడి


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఎన్ని సంస్కరణలు, ఎన్నెన్ని చైతన్య పథకాలు తెచ్చినా రాష్ట్రంలో బాల్య వివాహాలు ఆగడం లేదు. బొమ్మలకు పెళ్లిళ్లు చేసే వయసులోనే బాలికలెందరో పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. రాష్ట్రంలో 29.3 శాతం మంది ఆడపిల్లలకు 18 ఏళ్లు నిండకుండానే పెళ్లిళ్లు చేసినట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. కేంద్ర ఆరోగ్యశాఖ ప్రతి మూడేళ్లకు ఒకసారి దేశవ్యాప్తంగా ‘నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే’ పేరిట ఈ అధ్యయనం నిర్వహిస్తోంది. చివరిసారిగా 2015-16లో జరగగా, తాజాగా 2019-20లో నిర్వహించారు. ఈ సర్వేను అనుసరించి మన రాష్ట్రంలోని గ్రామాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇవి 32.9 శాతం గ్రామాల్లో జరిగితే, 21.7 శాతం పట్టణాలు, నగరాల్లో నమోదయ్యాయి. పురుషుల వివాహ వయోపరిమితి 21 ఏళ్లు. అయితే, రాష్ట్రంలో 14.5 శాతం మంది ఆ వయసు వచ్చేదాకా ఆగడం లేదు. నూనూగు మీసాలు రాకుండానే కుటుంబపెద్దల ఒత్తిడితో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.


వీరు అర్బన్‌ ప్రాంతాల్లో 13.1 శాతంగా, రూరల్‌ ప్రాంతాల్లో 15.2 శాతంగా ఉన్నారు.  ఇక.. అక్షరాస్యతలో ఆడపిల్లలు వెనుకబడ్డారు. రాష్ట్రంలో నాలుగక్షరాలు నేర్చిన మహిళలు 68.6 శాతం మందే.  అర్బన్‌లో వీరి జనాభా 79%. రూరల్‌లో 63.8 శాతం. అక్షరాస్యతలో మహిళలు, పురుషుల మధ్య 10 శాతమే వ్యత్యాసం ఉంది. 79.5% మంది పురుషులు మాత్రమే అక్షరాస్యత కలిగి ఉన్నారు. అర్బన్‌లో 86.4 శాతం, రూరల్‌లో 76.3% అక్షరాస్యత కలిగిన మగవారు ఉన్నారు. 


ఎడాపెడా కోతలు..

నొప్పులు ప్రారంభమైన తర్వాత కొద్దిసేపు ఎదురుచూడటం, అప్పటికి డెలివరీ కాకపోతే సిజేరియన్‌ చేసేయడం రాష్ట్రంలో బాగా పెరిగిపోయిన ధోరణి. ప్రభుత్వం, ప్రైవేటు అనే భేదం లేకుండా, ఆరోగ్య రంగంలో సిజేరియన్‌ అతి సాధారణమైపోయింది. రాష్ట్రంలో సాఽధారణ డెలివరీల కంటే సిజేరియన్స్‌ శాతం భారీగా పెరిగిపోయినట్టు ‘నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే’ తేల్చింది. డెలివరీకి అవకాశం ఉన్నా ప్రైవేటు ఆస్పత్రులు సిజేరియన్లు చేసేస్తుంటాయి. దాదాపు 63 శాతం విషయంలో ఇదే జరిగిందని సర్వే పేర్కొంది. చివరిసారిగా సర్వే నిర్వహించిన 2015-16 లెక్కల ప్రకారం, గత మూడేళ్లతో పొల్చితే ఇప్పుడు 1.1 శాతం సిజేరియన్‌ కేసులు మన రాష్ట్రంలో పెరిగాయి. 40.1 శాతం మందికి ఈ పద్ధతిని అనుసరించి ప్రసవం చేశారు. ఈ సంఖ్య ఇప్పుడు 42.4 శాతానికి పెరిగింది. ముఖ్యంగా అర్బన్‌ ప్రాంతాల్లో అవి ఎక్కువగా జరుగుతున్నాయి. రూరల్‌లో 39.3 శాతం ఉంటే, అర్బన్‌ ప్రాంతాల్లో ఏకంగా 50.5 శాతం మందికి సిజేరియన్‌ జరిగింది. ప్రైవేటు ఆస్పత్రులకు సంబంధించి.. పట్టణాల్లో 66.1 శాతం, రూరల్‌ ప్రాంతాల్లో 61.4 శాతం సిజేరియన్‌ ఆపరేషన్లు జరిగాయి.


ఇక.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30.9 శాతం అర్బన్‌లో, 25.2 శాతం రూరల్‌ ప్రాంతాల్లో నమోదయ్యాయి. మరోవైపు గర్భం దాల్చిన చాలామంది మహిళలు హెల్త్‌ చెక్‌పకు వెళ్లలేకపోతున్నారు. మొదటి చెకప్‌ కోసం 81.7 శాతం మహిళలు వెళ్తుంటే... ఆ తర్వాత వెళ్లే వారు 67.5 శాతం మంది మాత్రమే ఉన్నారు. ఇదిలాఉండగా, రాష్ట్రంలో డెలివరీ ఖర్చులు పెరిగాయి. 2015-16లో సగటున రూ.2322 ఉన్న ఈ ఖర్చు 2019-20 నాటికి రూ.3105కు పెరిగింది. 


ఎయిడ్స్‌ అంటే తెలియదట!

ఎయిడ్స్‌ పట్ల చాలా మందికి అవగాహన చాలా తక్కువగా ఉందని సర్వే ద్వారా తేలింది. విచిత్రంగా కండోమ్‌ వాడాలన్న అవగాహన మాత్రం ఎక్కువ మందిలో కనిపిస్తోంది. మహిళల్లో 24.6 శాతం మంది,  పురుషుల్లో 38.6 శాతం మందికి మాత్రమే ఎయిడ్స్‌పై అవగాహన ఉంది. అదేసమయంలో 63 శాతం మహిళలు, 82.6 శాతం మంది పురుషులు రతి సమయంలో కండోమ్‌ వినియోగిస్తున్నారు.


మత్తులో రాణులు..

రాష్ట్రంలో 3.8 శాతం మంది మహిళలు ధూమపానం చేస్తున్నట్లు సర్వే వెల్లడించింది. వారిలో 15 ఏళ్లు దాటిన వాళ్లే అధికంగా ఉన్నారు. 1.9 శాతం అర్బన్‌ ప్రాంతాల్లో ఉండగా... 4.7 శాతం మంది రూరల్‌ ప్రాంతాల్లో ఉన్నారు. ఇక.. 0.5 శాతం మంది మహిళలు మద్యపానం చేస్తున్నారు. అర్బన్‌లో 0.3 శాతం, రూరల్‌లో 0.6 శాతం మంది మహిళలు మందుసేవిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కుటుంబ కలహాలు, లైంగిక వేధింపులు కూడా ఎక్కువే.  30 శాతం మంది భార్యభర్తలు గొడవలు పడితే, 3.7 శాతం మంది మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అయితే, గత మూడేళ్లతో పోల్చితే 2019-20లో కుటుంబ కలహాలు, లైంగిక వేధింపుల తీవ్రత తగ్గినట్లు సర్వే అంచనా వేసింది. 

Updated Date - 2020-12-15T09:16:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising