ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులకు చెవిరెడ్డి భారీ వితరణ

ABN, First Publish Date - 2020-04-10T07:21:25+05:30

కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజానీకానికి తాను అండగా నిలుస్తానని చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు విధుల్లో ఉన్న 11,500మంది ఉద్యోగులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రూ.1.6 కోట్ల నిత్యావసరాలు పంపిణీ


తిరుపతి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజానీకానికి తాను అండగా నిలుస్తానని చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు విధుల్లో ఉన్న 11,500మంది ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులకు రూ1.6 కోట్లతో నిత్యావసరాలను గురువారం పంపిణీ చేశారు. 10 కిలోల బియ్యం, 5 కిలోల గోధుమ పిండి, 2 లీటర్ల నూనె.. ఇలా 25 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. గతంలోనూ నియోజకవర్గంలోని ఇంటింటికి రెండు విడతల్లో శానిటైజర్లు అందజేశారు. బుధవారం నుంచి ప్రతి ఇంటికీ సర్జికల్‌, క్లాత్‌ మాస్కుల పంపిణీ చేపట్టారు. ప్రతి కుటుంబానికి పది కోడిగుడ్లు, 10 కిలోల చొప్పున 1600 టన్నుల కూరగాయలు, 15 చొప్పున 23 లక్షల సి-విటమిన్‌ మాత్రలు  పంపిణీ చేయనున్నట్టు చెవిరెడ్డి తెలిపారు.



Updated Date - 2020-04-10T07:21:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising