ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆవ భూముల్లోనే రూ.500 కోట్ల అవినీతి: చంద్రబాబు

ABN, First Publish Date - 2020-08-20T15:46:27+05:30

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఇళ్లపట్టాల పేరుతో భూసేకరణలో అవినీతిపై ఫిర్యాదు చేశారు.అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఇళ్లపట్టాల పేరుతో భూసేకరణలో అవినీతిపై ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఇళ్లపట్టాల పేరుతో భూసేకరణలో అవినీతిపై ఫిర్యాదు చేశారు. ఇళ్ల పట్టాల పేరుతో పేదల భూములు లాక్కోవడం బాధాకరమన్నారు. ఇళ్ల నిర్మాణానికి అనువుగాని భూముల సేకరణ ఇంకో దుశ్చర్య అని చంద్రబాబు పేర్కొన్నారు. చిత్తడి నేలలు, ముంపు భూములు, మడ అడవులను ప్రభుత్వమే కొనడం దుర్భరమన్నారు. 


రాజానగరం(తూగో) కోరుకొండ మండలం బూరుగుపూడి భూసేకరణ ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. 600ఎకరాల ఆవ భూములు ఇళ్లపట్టాల కింద సేకరించారన్నారు. ఎకరం రూ45లక్షల చొప్పున రూ 270కోట్లు ఖర్చుచేశారని వెల్లడించారు. ఆవ భూముల్లోనే మొత్తం రూ 500కోట్ల అవినీతి కుంభకోణం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. ఇళ్లపట్టాల భూసేకరణలో సరికొత్త అవినీతికి అంకురార్పణ జరిగిందన్నారు. అధికార వైసీపీ నాయకులు స్థానిక అధికారులతో కుమ్మక్కై దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు.


భూసేకరణలో తొలిదశ అవినీతి.. మెరక, లే అవుట్, రోలింగ్‌లో రెండో దశ అవినీతి జరిగిందన్నారు. ఇళ్ల పట్టాలకు భూసేకరణపై సమగ్ర విచారణకు ఆదేశించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అప్పుడే అవినీతి దృష్టాంతాలు అనేకం బయట పడతాయన్నారు. సమగ్ర విచారణ ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. లేఖతోపాటు వరదల్లో నీట మునిగిన ఆవభూములపై పేపర్ క్లిప్పింగ్‌లు కూడా పంపారు.

Updated Date - 2020-08-20T15:46:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising