చిత్తూరు నేతలకు చంద్రబాబు పరామర్శ
ABN, First Publish Date - 2020-12-11T21:37:21+05:30
చిత్తూరు నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. వైసీపీ దాడిలో గాయపడ్డ టీడీపీ నేతలను చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. వైసీపీ దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
అమరావతి: చిత్తూరు నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. వైసీపీ దాడిలో గాయపడ్డ టీడీపీ నేతలను చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. వైసీపీ దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. దాడి చేసిన వారిని వదిలేసి గాయపడిన వారిని అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. వైసీపీ దౌర్జన్యాలకు ప్రజలే బుద్దిచెబుతారని, నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలపై దాడిని చంద్రబాబు ఖండించారు. పరామర్శకు వెళ్తున్న నాయకులపై దాడి చేయడం గర్హనీయమన్నారు. జగన్ ఫాసిస్ట్ పాలనకు ఈ దాడులు అద్దం పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లాకు గండికొట్టారని, తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నేరగాళ్ల రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చారని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో పర్యటన నిమిత్తం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, పీలేరు నియోజకవర్గ ఇంఛార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బయలుదేరారు. ముందుగానే ప్లాన్‌తో వచ్చిన వైసీపీ శ్రేణులు.. టీడీపీ నేతల వాహనాలను అడ్డుకున్నాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలోనే వైసీపీ శ్రేణులు.. టీడీపీ నేతల రెండు కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కిషోర్‌కు అడ్డుగా నిలవడంతో నేతలకు ఎవరికీ ఏమీ కాలేదు.
Updated Date - 2020-12-11T21:37:21+05:30 IST