శ్రీశైలం ప్రమాదంపై చంద్రబాబు దిగ్ర్భాంతి
ABN, First Publish Date - 2020-08-22T09:24:19+05:30
శ్రీశైలం ఎడమ కాల్వ విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దిగ్ర్భాంతి..
అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమ కాల్వ విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కొందరు ఇంజనీర్లు ఈ ఘటనలో మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మిగిలిన వారు సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2020-08-22T09:24:19+05:30 IST