ఈసీని కులం పేరుతో దూషించడంపై బాబు రియాక్షన్
ABN, First Publish Date - 2020-03-16T16:48:31+05:30
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రగడ నడుస్తోంది...
అమరావతి : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రగడ నడుస్తోంది. ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రమేశ్ కుమార్ ప్రకటించడంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు, ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. టీడీపీ అధినేత చంద్రబాబే నియమించారని.. ఆయన కులమేనంటూ కూడా జగన్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. సోమవారం నాడు టీడీపీ నేతలతో బాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల వాయిదా, రమేశ్ కుమార్ ప్రస్తావన వచ్చింది.
గుణపాఠం తప్పదు!
‘ఈసీని కులం పేరుతో దూషించడం నీచాతినీచం. 16నెలలు జైల్లో ఉన్న ఏ1, ఏ2 నిందితులు ఈసీని నిందించడం హేయం. దొంగలు జడ్జిని నిందించడాన్ని ప్రజలే చూస్తున్నారు. కండిషన్ బెయిల్‌లోని నిందితులు రాజ్యాంగ వ్యవస్థ అధిపతిని దూషిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో, న్యాయక్షేత్రంలో వీళ్లకు గుణపాఠం తప్పదు’ అని బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2020-03-16T16:48:31+05:30 IST