ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రజినీ పొలిటికల్ ఎంట్రీపై చంద్రబాబు, పవన్ ఏమన్నారంటే..

ABN, First Publish Date - 2020-12-03T23:07:47+05:30

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్వాగతించారు. రజినీకాంత్‌ తనకు మంచి మిత్రుడు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆయన రాజకీయాల్లోకి వస్తుండటాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అలాగే రాజకీయాల్లో కూడా రజినీకాంత్‌ రాణించాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడం సహజమేనని చంద్రబాబు పేర్కొన్నారు.


పరోక్షంగా ఎప్పట్నుంచో రజినీ రాజకీయాల్లోనే ఉన్నారు: పవన్

రజినీకాంత్ రాజకీయాల్లో రావాలని ఎప్పట్నుంచో ఉందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తెలిపారు. ఆయన రాజకీయాల్లోకి రాకపోయినా గతంలో ఓ పార్టీ గెలుపు కోసం కృషి చేశారని గుర్తుచేశారు. ప్రత్యక్షంగా కాకపోయినా.. పరోక్షంగా ఎప్పటినుంచో రజినీకాంత్ రాజకీయాల్లోనే ఉన్నారని వెల్లడించారు. రజినీకి విపరీతంగా అభిమాన బలం ఉందని చెప్పుకొచ్చారు. రజినీకాంత్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు పవన్ ఆకాంక్షించారు.


2021, జనవరిలో తన రాజకీయ పార్టీ ఆవిర్భావం ఉండనున్నట్లు రజినీకాంత్ గురువారం స్పష్టం చేశారు. దీంతో.. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంటున్నట్లు తేలిపోయింది. అంతేకాదు, రజినీ రాజకీయ పార్టీ పేరు, విధి విధానాలపై డిసెంబర్ 31నే ఓ క్లారిటీ రానున్నట్లు ఆయన తాజా వ్యాఖ్యలతో స్పష్టమైంది. ఇప్పటికే కమల్‌హాసన్ పార్టీ పెట్టి వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.తమిళ సూపర్ స్టార్



Updated Date - 2020-12-03T23:07:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising