ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
ABN, First Publish Date - 2020-12-25T14:52:13+05:30
తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ఆయన..
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ‘‘ప్రజలకు రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించడానికి విష్ణుమూర్తి వైకుంఠం నుంచి భూమికి దిగొచ్చి మురాసురుడిని చంపాడంట. అలాంటిది తిరుమల వెంకటేశునితోనే పెట్టుకుంటున్న వారి సంగతి ఏంటో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు’’ అని పేర్కొన్నారు. భక్తి ప్రపత్తులతో వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటున్న వారందరికీ పండుగ శుభాకాంక్షలని ట్వీట్ చేశారు.
Updated Date - 2020-12-25T14:52:13+05:30 IST