ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నన్నేమీ చేయలేక కులం ముద్ర వేశారు..: చంద్రబాబు

ABN, First Publish Date - 2020-08-07T23:53:58+05:30

వైసీపీ నాయకులు ఏ ఎండకు ఆ గొడుగు పడతారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : వైసీపీ నాయకులు ఏ ఎండకు ఆ గొడుగు పడతారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన తర్వాత ఏపీలో జరిగిన అభివృద్ధిపై ఇవాళ ఆన్‌లైన్‌లో మీడియాతో మాట్లాడారు. గతంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మొదలుకని ఆ పార్టీ నేతలు చెప్పిన మాటలకు ఇప్పటి మాటలకు పొంతన లేదని బాబు ఎద్దేవా చేశారు. రాజధానిపై వైసీపీ నేతలు మాట్లాడిన వీడియోలను చూపిస్తూ.. వీళ్లకు భజన చేయడం తప్ప.. అభివృద్ధి చేయడం రాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


నన్నేమీ చేయలేక..!

‘అమరావతి నా స్వార్థం కోసం కాదు.. ప్రజల కోసం. సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తిని నేను. నన్ను ఏం చేయలేక నాపై కులం ముద్ర వేశారు. మనం ఇప్పుడు పోరాడకపోతే తీవ్రంగా నష్టపోతాం. ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్దాలే. కరోనాపై నేను మాట్లాడితే విమర్శించారు. ఇప్పుడు దేశంలో కరోనా కేసుల పెరుగుదలలో ఏపీ ముందుంది. రాష్ట్ర ప్రయోజనాలే నా ప్రయోజనాలు. రాష్ట్రాన్ని మూడు ముక్కలాట ఆడతానంటే ఎలా..!?. అభివృద్ధి అంటే అన్ని ప్రాంతాలకూ ప్రాజెక్టులు రావాలి. కర్నూలు జిల్లా ప్రజలు శ్రీకాకుళం వెళ్లాలంటే ఎలా వెళ్తారు..?. అమరావతి మనందరి బాధ్యత అని ప్రజలు గుర్తు పెట్టుకోవాలిఅని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Updated Date - 2020-08-07T23:53:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising