ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ పాలనంతా భూకబ్జాలు, అవినీతిమయం: బాబు

ABN, First Publish Date - 2020-05-27T20:43:31+05:30

జగన్‌ పాలనంతా భూకబ్జాలు, అవినీతిమయమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జగన్‌ పాలనంతా భూకబ్జాలు, అవినీతిమయమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. మహానాడు సందర్బంగా ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. విశాఖలో ఆరోగ్యసేతు యాప్ తయారు చేసే వ్యక్తికి చెందిన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటూ పులివెందుల నుంచి వచ్చిన కొంతమంది దౌర్జన్యం చేశారన్నారు. అలాగే కాకినాడ మడ అడవులు, ఇంకొకవైపు ఆవ, రాజమండ్రి భూములు, గుడివాడలో ప్రైవేటు భూములు.. 63 మంది కొనుక్కుంటే అవి ఇచ్చేయాలని ఓ మంత్రి బలవంతం చేయడమంటే.. వాళ్లను ఏమనాలో అర్థం కావడం లేదని అన్నారు.


టీటీడీ భూములు అమ్మకానికి పెట్టడం.. ఈ సమయంలో భూములు అమ్మడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం తప్పు చేయడం, కప్పి పుచ్చుకోడానికి ఎదురుదాడి చేస్తుందని విమర్శించారు. సింహాచలంలో భూముల కబ్జా చేశారని, శ్రీశైలం, కనకదుర్గమ్మ గుడిలో అవినీతి జరిగిందని, ఎక్కడ చూసినా అవినీతేనని, బిల్డ్ ఏపీ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ను అమ్మేయడం... ఈ అరాచకమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఆస్తులు అమ్మే అధికారం ఎవరిచ్చారని చంద్రబాబు నిలదీశారు. 


రాష్ట్రంలో కరోనా వైరస్‌పై జగన్ సీరియస్‌గా ద‌ృష్టి పెట్టలేదని చంద్రబాబు విమర్శించారు. కొన్ని రాష్ట్రాలు కరోనాను పూర్తిగా కట్టడి చేయగలిగాయన్నారు. తెలుగుదేశం పార్టీ ఉంటే తప్పకుండా కరోనాను కట్టడి చేసేవాళ్లమన్నారు. మొదట్నించి కరోనా గురించి తాను చెబుతుంటే.. ఎగతాళి చేశారన్నారు. సీఎం జగన్ అవగాహన లేకుండా మాట్లాడారని.. బ్లీచింగ్ ఫౌడర్, పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే పోతుందని మాట్లాడారని చంద్రబాబు విమర్శించారు. 

Updated Date - 2020-05-27T20:43:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising