సామాజిక దూరం పాటిస్తేనే కరోనాను ఎదుర్కోగలం: చంద్రబాబు
ABN, First Publish Date - 2020-03-27T23:00:52+05:30
సామాజిక దూరం పాటిస్తేనే కరోనాను ఎదుర్కోగలమని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.
గుంటూరు: సామాజిక దూరం పాటిస్తేనే కరోనాను ఎదుర్కోగలమని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. 80 ఏళ్ల పైబడిన వాళ్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. ముందు జాగ్రత్తలు పాటించడం వల్లే.. అనేక దేశాల్లో కరోనా నియంత్రణలో ఉందని చంద్రబాబు అన్నారు. కరోనాకు మందులు లేవు.. స్వయం నియంత్రణే మందని చంద్రబాబు తెలిపారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని, ఇలాంటి సమయంలో ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని, సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు కలిగించవద్దని చంద్రబాబు సూచించారు. పేదలకు రాష్ట్ర ప్రభుత్వాలు రూ.5 వేలు ఇవ్వాలని చంద్రబాబు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. సమాజహితం కోసం రాజకీయాలకతీతంగా పనిచేయాలని చంద్రబాబు అన్నారు. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని చంద్రబాబు తెలిపారు.
Updated Date - 2020-03-27T23:00:52+05:30 IST