ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయసాయి ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబు ఇదీ..

ABN, First Publish Date - 2020-09-20T00:38:35+05:30

ఆటోమొబైల్స్ అమ్మకాలు క్రమేపీ పుంజుకుంటున్నట్లు భారీ పరిశ్రమల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆటోమొబైల్స్ విక్రయాల్లో స్వల్ప పురోగతి


అమరావతి/న్యూఢిల్లీ : ఆటోమొబైల్స్ అమ్మకాలు క్రమేపీ పుంజుకుంటున్నట్లు భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. గత ఏడాది ఆగస్టుతో పోల్చుకుంటే ఈ ఏడాది ఆగస్టులో ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 75.29 శాతం పెరిగినట్లుగా సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) అందించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోందని రాజ్యసభలో శనివారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ చెప్పారు. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రయాణీకుల వాహనాల విక్రయాల్లో 3.86 శాతం, మూడు చక్రాల వాహనాల విక్రయాల్లో 77.16 శాతం, ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో 15.24 శాతం క్షీణత నమోదైనట్లుగా ఆయన తెలిపారు.


ఫైనాన్స్ లభ్యత తగినంత లేకపోవడం, కమర్షియల్ వాహనాల యాక్సిల్ లోడ్ పరిమితిని 25 శాతానికి పెంచడం వలన కొత్త వాహనాల అవసరం తగ్గిపోవడం, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వసూళ్ళతో వాహన కొనుగోలు ఖర్చు పెరగడం, బీఎస్ 6 ప్రమాణాల ప్రకారం కొత్త వాహనాల తయారీ, కరోనా మహమ్మారి కారణంగా వాహన కొనుగోళ్ళకు ప్రజలు మొగ్గు చూపకపోవడం...ఇత్యాది కారణాలతో ఆటోమొబైల్ రంగం పురోగతి మందగించినట్లు మంత్రి చెప్పారు. ఈ రంగం తిరిగి పుంజుకోవడానికి ప్రభుత్వం ప్యాకేజీల రూపంలో ఆర్థిక రంగంలో ఊపు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆటోమొబైల్స్ విక్రయాలపై జీఎస్టీ తగ్గింపు తమ చేతుల్లో లేదని జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల మేరకే పన్నుల విధింపు జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.


Updated Date - 2020-09-20T00:38:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising