మాజీ మంత్రి అయ్యన్నపై మరో కేసు
ABN, First Publish Date - 2020-06-18T08:29:46+05:30
మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడుపై మరో కేసు నమోదైంది. మునిసిపల్ కార్యాలయంలో అయ్యన్నపాత్రుడు తాత, మాజీ ఎమ్మెల్సీ రుత్తల లత్సాపాత్రుడు చిత్రపటాన్ని అధికారులు తొలగించారు...
నర్సీపట్నం, జూన్ 17: మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడుపై మరో కేసు నమోదైంది. మునిసిపల్ కార్యాలయంలో అయ్యన్నపాత్రుడు తాత, మాజీ ఎమ్మెల్సీ రుత్తల లత్సాపాత్రుడు చిత్రపటాన్ని అధికారులు తొలగించారు. దీంతో ఈనెల 15న టీడీపీ వర్గీయులు మునిసిపల్ కార్యాలయం ఎదుట టెంట్లు వేసి నిరసన తెలిపి, బహిరంగ సభ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారన్న అభియోగంపై కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం గమనార్హం.
Updated Date - 2020-06-18T08:29:46+05:30 IST