ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసుల మాఫీయే జగన్‌ఎజెండా

ABN, First Publish Date - 2020-09-25T08:22:51+05:30

‘‘ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన ఆర్థిక నేరాల కేసులను మాఫీ చేసుకోడానికి కేంద్ర పెద్దల పాదాలపై పడుతున్నారు. జగన్‌ నేరాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం జగన్‌పై టీడీపీ ఎంపీల ఫైర్‌


న్యూఢిల్లీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన ఆర్థిక నేరాల కేసులను మాఫీ చేసుకోడానికి కేంద్ర పెద్దల పాదాలపై పడుతున్నారు. జగన్‌ నేరాల మాఫీయే లక్ష్యంగా వైసీపీ ఎంపీలు పనిచేస్తున్నారు. ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలి పించిన తర్వాత.. ప్రత్యేకహోదాతోపాటు రాష్ట్ర విభజన సమస్యలన్నీ గాలికొదిలేశారు’’ అని తెలుగుదేశం పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని నిప్పులు చెరిగారు.


దాదాపు 42వేలకోట్ల విలువైన ఆర్థిక నేరాలకు సంబంధించి దాఖలైన కేసుల్లో జైలుకు వెళ్లకుండా తప్పించుకోడానికి సీఎం జగన్‌ వ్యూహాలు పన్నుతున్నారని లోక్‌సభలో టీడీపీపక్ష నేత రామ్మోహన్‌నాయుడు విమర్శించారు. అమరావతి భూములపై సీబీఐ విచారణ జరిపించాలని ప్లకార్డులు పట్టుకునే వైసీపీ ఎంపీలు.. ప్రత్యేక హోదా వంటి సమస్యలపై ఎందుకు ఆందోళన చేయడం లేదని నిలదీశారు. మతపరమైన విద్వేషాలు సృష్టిస్తూ రాష్ర్టాన్ని సర్వనాశనం చేస్తున్నారన్నారు. హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నా, మంత్రులు మతకలహాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నా సీఎం జగన్‌ ఎందుకు నోరు మెదపడంలేదని ఆయన ప్రశ్నించారు. 



విజయసాయికి ఘోర అవమానం: కనకమేడల 


కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కాళ్లు పట్టుకోడానికే జగన్‌ ఢిల్లీలో పర్యటించారని టీడీపీ రాజ్యసభాపక్ష నేత కనకమేడల రవీంద్రకుమార్‌ ఎద్దేవా చేశారు. కరోనా అంశంపై రాజ్యసభలో చర్చ జరుగుతుంటే వైసీపీ నేత విజయసాయిరెడ్డి చర్చకు సంబంధంలేని అంశాలపై మాట్లాడి వివాదం రేపారన్నారు.  ఆయన వ్యాఖ్యలను చైర్మన్‌ రికార్డుల నుంచి తొలగించడంతో విజయసాయికి సభలో ఘోర అవమానం జరిగిందని కనకమేడల పేర్కొన్నారు.


కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిసి కేంద్ర పునర్విభజన చట్టం ప్రకారం ఒకసారి ఏర్పాటైన రాజధానిని మార్చడానికి ఎందుకు వీల్లేదనేది లిఖితపూర్వకంగా ప్రశ్నించామని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. దీనిపై న్యాయనిపుణులతో చర్చించి ధర్మబద్ధమైన నిర్ణయం తీసుకుంటామని హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా హామీ ఇచ్చారని జయదేవ్‌ చెప్పారు.


జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద టీడీపీప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో చేపట్టిన మెటీరియల్‌ కాంపొనెంట్‌ పనులకు సంబంధించి పెండింగ్‌ ఉన్న నిధులను తక్షణమే విడుదల చేయాలని కేంద్రానికి ఆ పార్టీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు.


Updated Date - 2020-09-25T08:22:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising