ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధానిపై హైకోర్టు ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం: సుంకర పద్మ

ABN, First Publish Date - 2020-08-14T20:54:39+05:30

ఏపీ రాజధాని తరలింపు అంశంపై హైకోర్టు జారీ చేసిన తాజా ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని ఏపీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు, మహిళా జేఏసీ నాయకురాలు సుంకర పద్మశ్రీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ రాజధాని తరలింపు అంశంపై హైకోర్టు జారీ చేసిన తాజా ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని ఏపీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు, మహిళా జేఏసీ నాయకురాలు సుంకర పద్మశ్రీ ప్రకటించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించక తప్పదని అన్నారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆమె.. న్యాయమైన ఈ పోరాటంలో రైతులు తప్పక విజయం సాధిస్తారని పేర్కొన్నారు. అమరావతి రైతులు శాంతియుతంగా, గాంధేయ పద్ధతిలో ఈ పోరాటంలో విజయం సాధించేవరకు ఉద్యమించాలని కోరుతున్నానని పద్మశ్రీ అన్నారు. రైతులు, మహిళల న్యాయమైన పోరాటానికి రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టకు పోకుండా రాజధాని రైతులతో నేరుగా చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించాలని సుంకర పద్మ శ్రీ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-08-14T20:54:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising