ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని పేరు లేకుండా నిర్మాణాలకు శ్రీకారం!

ABN, First Publish Date - 2020-08-20T17:12:23+05:30

విశాఖకు తరలించడానికి న్యాయపరమైన అడ్డంకులు ఏర్పడడంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విశాఖకు తరలించడానికి న్యాయపరమైన అడ్డంకులు ఏర్పడడంతో రాజధాని పేరు లేకుండా నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. అనాధికారంగా జరుగుతున్న రాజధాని నిర్మాణాలపై ఏబీఎన్ ప్రత్యేక కథనం..


భీమిలీ నియోజకవర్గం కాపులప్పాడు సర్వే నెంబర్ గ్రేహౌండ్స్‌కు చెందిన స్థలం ఇక్కడ ఇప్పటికే గ్రేహౌండ్స్‌ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. పటిష్టమైన భద్రత మధ్య ఉన్న ఈ స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఈనెల 16న శ్రీకారం చుట్టినట్లు సమాచారం. అయితే ఈ గెస్ట్ హౌస్ నిర్మాణ ప్రారంభానికి అధికారులు మాత్రమే హాజరై భూమి పూజ చేసినట్లు తెలుస్తోంది. విశాఖకు వచ్చేటటువంటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎం, మంత్రులు, సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ ఐఏఎస్ సహా వీవీఐపీలు వచ్చినప్పుడు వారికి ప్రోటోకాల్ ప్రకారం గెస్ట్ హౌస్ సమకూర్చడం ప్రస్తుతం కష్టంగా ఉంటోంది. విజయవాడ, విశాఖ స్టార్ హోటళ్లలో వసతికి భారీ వ్యయం అవుతోంది. అందుకే రాష్ట్రంలో ఎక్కడికక్కడ గెస్ట్ హౌస్‌లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గెస్ట్ హౌస్‌ల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను పరిశీలించమని కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసినట్లు సమాచారం. గెస్ట్ హౌస్‌ల నిర్మాణానికి సంబంధించిన పలు స్థలాల వివరాలను కలెక్టర్ వినయ్ చంద్ ప్రభుత్వానికి అందజేసినట్లు తెలియవచ్చింది.

Updated Date - 2020-08-20T17:12:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising