ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని దళితుల ఆకలి కేకలు పట్టవా?

ABN, First Publish Date - 2020-06-06T10:21:28+05:30

రాజధానిలో దళితుల ఆకలి కేకలు వినే నాథుడే లేకుండా పోయారని అమరావతి పరిరక్షణ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దళితులను నమ్మించి మోసం చేస్తున్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జీవోనెం 41 యథావిధిగా కొనసాగించాలి
  • దళిత జేఏసీ నేతల డిమాండ్‌
  • 171వ రోజు అమరావతి రైతుల ఆందోళనలు


గుంటూరు, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): రాజధానిలో దళితుల ఆకలి కేకలు వినే నాథుడే లేకుండా పోయారని అమరావతి పరిరక్షణ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దళితులను నమ్మించి మోసం చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం చెప్పినట్టు రూ.2500 అమరావతి పింఛన్‌ను రూ.5వేలకు వెంటనే పెంచాలని డిమాండ్‌ చేశారు. వార్షిక కౌలును వెంటనే జమచేయాలని కోరుతూ తుళ్లూరులోని సీఆర్‌డీఏ కార్యాలయం ముందు జేఏసీ నేతలు శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజధాని పరిధిలో అసైన్డ్‌ భూములు రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పించే విధంగా గత ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం. 41ని యథావిఽధిగా కొనసాగించాలని కోరుతూ సీఆర్‌డీఏ అధికారులకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు శుక్రవారానికి 171వ రోజుకు చేరాయి. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 29 గ్రామాల రైతులు వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అలానే అమరావతితోనే రాష్ట్రానికి వెలుగంటూ రాత్రి 7.30 గంటలకు ఇళ్లలో విద్యుత్‌ దీపాలు ఆపి కొవ్వొత్తులు, దీపాలు వెలగించి జై అమరావతి, సేవ్‌ అమరావతి నినాదాలు చేశారు.

Updated Date - 2020-06-06T10:21:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising