దళిత యువకులపై వైసీపీ నేతల దాడి
ABN, First Publish Date - 2020-09-14T08:13:47+05:30
ట్రాక్టర్‌ను అడ్డు తీయాలని కోరిన దళిత యువకులను ‘మాకే ఎదురు చెబుతారా...?’
వినుకొండ టౌన్, సెప్టెంబరు 13: ట్రాక్టర్‌ను అడ్డు తీయాలని కోరిన దళిత యువకులను ‘మాకే ఎదురు చెబుతారా...?’ అంటూ వైసీపీ నాయకులు దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా వినుకొండ మండలం నరగాయపాలెంలో జరిగింది. ఎస్సీ కాలనీకి చెందిన పెద్దేటి బాబు, పెద్దేటి కోటిరత్నం శనివారం దారికి అడ్డుగా ఉన్న ట్రాక్టర్‌ను పక్కకు తీయాలని కోరారు.
దీంతో ఆగ్రహించిన వైసీపీ నాయకులు మాలపాటి గోవిందురెడ్డి, బాలిరెడ్డిలు ‘మమ్మల్నే ప్రశ్నిస్తావా’ అంటూ మరికొందరితో కలిసి దళిత యువకులపై దాడి చేశారు. ఈ ఘటనలో పెద్దేటి బాబు, కోటిరత్నంలకు గాయాలు కాగా వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాబు ఫిర్యాదు మేరకు మొత్తం ఆరుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
Updated Date - 2020-09-14T08:13:47+05:30 IST