ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక నిర్వహణపై నివేదిక సమర్పించిన కాగ్
ABN, First Publish Date - 2020-06-18T23:39:54+05:30
2017-18 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక నిర్వహణపై కాగ్ నివేదిక సమర్పించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2017-18కి 8,03,873 కోట్లుగా ఉందని కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ తెలిపారు.
అమరావతి: 2017-18 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక నిర్వహణపై కాగ్ నివేదిక సమర్పించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2017-18కి 8,03,873 కోట్లుగా ఉందని కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ తెలిపారు. 2017-18లో రెవెన్యూ రాబడి జీఎస్డీపీలో 1,05,062 కోట్లుగా( 13.7 శాతం) ఉందని, అంతకుముందుటేడుకన్నా 6 వేల 78 కోట్ల రూపాయల మేర పెరిగిందని కాగ్ నివేదికలో పేర్కొంది. 2016-17తో పోలిస్తే రెవన్యూ వ్యయం కూడా 1,21,214 పెరిగిందని కాగ్ తెలిపింది.
Updated Date - 2020-06-18T23:39:54+05:30 IST