విశాఖ ఎంపీ సీటుకు ఉప ఎన్నిక పెట్టండి
ABN, First Publish Date - 2020-10-04T08:18:50+05:30
రాజధాని అంశంపై విశాఖ లోక్‌స భ స్థానానికి ఉప ఎన్నిక పెట్టి తేల్చుకుందామా? అని టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న
అయ్యన్న
అమరావతి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): రాజధాని అంశంపై విశాఖ లోక్‌స భ స్థానానికి ఉప ఎన్నిక పెట్టి తేల్చుకుందామా? అని టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వైసీపీకి సవాల్ చేశారు.
‘‘విశాఖ ఒక్క చోటే ఉప ఎన్నిక కు వెళ్దాం. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఉద్దేశమేమిటో తెలిసిపోతుంది. సవాల్‌కు నేను సిద్ధం. మంత్రి ధర్మాన కృష్ణదాస్ సిద్ధమా?’’ అని ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Updated Date - 2020-10-04T08:18:50+05:30 IST