అంగరంగ వైభవం.. బ్రహ్మరథోత్సవం
ABN, First Publish Date - 2020-03-16T09:03:53+05:30
ధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. భక్తుల గోవిందనామ స్మరణతో మార్మోగాయి. యువకులు పోటీపడి రథాన్ని లాగితే.. భక్తులు స్వామివారి రథంపైకి దవణం, మిరియాలు విసురుతూ తన్మయత్వం చెందారు. అనంతపురం జిల్లా కదిరిలో
కదిరి: వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. భక్తుల గోవిందనామ స్మరణతో మార్మోగాయి. యువకులు పోటీపడి రథాన్ని లాగితే.. భక్తులు స్వామివారి రథంపైకి దవణం, మిరియాలు విసురుతూ తన్మయత్వం చెందారు. అనంతపురం జిల్లా కదిరిలో ఆదివారం జరిగిన ఖాద్రీ లక్ష్మీనరసింహాస్వామివారి రథోత్సవ వైభవమిది. 15 రోజులపాటు సాగిన స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రథోత్సవం జరిగింది. ఉదయం 8.15 గంటలకు ప్రారంభమైన రథోత్సవం మధ్యాహ్నం 12.48 గంటలకు ముగిసింది. శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీవారు తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
Updated Date - 2020-03-16T09:03:53+05:30 IST