ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొరాయించిన టీటీడీ వెబ్‌సైట్ సర్వర్లు

ABN, First Publish Date - 2020-12-11T18:04:06+05:30

టీటీడీ వెబ్‌సైట్ సర్వర్లు మరోసారి మొరాయించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: టీటీడీ వెబ్‌సైట్ సర్వర్లు మరోసారి మొరాయించాయి. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 10 రోజులపాటు వైకుంఠద్వారాలు తెరవాలని నిర్ణయించింది. 10 రోజులకు సంబంధించి దర్శనం టిక్కెట్ల కోటాను పూర్తిగా ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంచింది. అందులో భాగంగా ఈనెల 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించనుంది. వైకుంఠద్వార దర్శనం నుంచి ప్రతి రోజు 20వేల మంది భక్తులను అనుమతిస్తారు. ఇలా 10 రోజులకు సంబంధించి 2 లక్షల టిక్కెట్లను టీటీడీ అధికారులు ఆన్‌లైన్‌లో పెట్టారు.


శుక్రవారం ఉదయం 2 లక్షల టిక్కెట్లను అందుబాటులో ఉంచగా ఇప్పటికే 70 వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. టిక్కెట్లు విడుదల చేసిన అరగంటలోనే ఏకాదశి, ద్వాదశి పర్వదినాల టిక్కెట్ల కోటా పూర్తయింది. మిగిలిన రోజుల టిక్కెట్ల కోసం లక్షలాదిగా భక్తులు వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయడంతో సర్వర్లు మొరాయించాయి. ఒక్కసారిగా వెబ్‌సైట్‌కు రష్ పెరగడంతో సైట్ తెరుచుకోవడంలేదు. సర్వర్‌ను త్వరలోనే పునరిద్ధరిస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.  

Updated Date - 2020-12-11T18:04:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising