ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా ఉద్యమం మరింత తీవ్రతరం: సోమువీర్రాజు

ABN, First Publish Date - 2020-09-19T13:38:51+05:30

అంతర్వేది ఘటనలో చర్చిపై హిందూ యువకులు దాడి చేశారని కేసులు పెట్టారని... దోషులను గుర్తించకుండానే అక్రమంగా అరెస్టులు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అంతర్వేది ఘటనలో చర్చిపై హిందూ యువకులు దాడి చేశారని కేసులు పెట్టారని... దోషులను గుర్తించకుండానే  అక్రమంగా అరెస్టులు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు అన్నారు. వీటికి  నిరసనగా ఛలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునిచ్చామని తెలిపారు. అయితే ప్రభుత్వం ఎక్కడికి అక్కడ తమ పార్టీ శ్రేణులను అక్రమ గృహనిర్బంధంలో పెట్టి పోలీసులతో అడ్డుకున్నారని.. ఈ పరిణామాలను  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. జిల్లాల వారీగా అనేక మంది నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారన్నారు. ముఖ్యమైన నాయకులను, పార్టీ పెద్దలను పోలీస్ స్టేషన్‌లలో పెట్టడం, రోడ్డు మార్గాల ద్వారా పోలీసు వాహనాల్లో తిప్పి సాయంత్రం 6 గంటల సమయంలో అందరినీ విడిచి పెట్టిన ప్రభుత్వ చర్యలను  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాల మీద జరుగుతున్న  దాడులకు వ్యతిరేకంగా పోరాడతామని తేల్చిచెప్పారు. బీజేపీ రాష్ట్ర పదాధికారులు,  జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూనే ఉంటామన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలను సోమువీర్రాజు అభినందనలు తెలిపారు. 

Updated Date - 2020-09-19T13:38:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising