ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీపై రెండు సర్జికల్ స్ట్రైక్స్.. జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-12-13T21:14:22+05:30

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఒక సర్జికల్ స్ట్రైక్ చేస్తే.. ఏపీలో రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఒక సర్జికల్ స్ట్రైక్ చేస్తే.. ఏపీలో రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. తిరుపతిలో మీడియాతో ఆదివారం మాట్లాడిన ఆయన.. పోలీస్ స్టేషన్‌లో క్రిస్మస్ సంబరాలపై మండిపడ్డారు. ప్రభుత్వమే మత ప్రచారం నిర్వహిస్తున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. పోలీస్ స్టేషన్‌లో దసరా సంబరాలు ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నికలో రెండు పార్టీలకు బుద్ధి చెబుతామన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం నిధులు ఉన్నాయని, పెట్టుబడి అంతా నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే అన్నారు. గత టీడీపీని, ఇప్పటి వైసీపీ సర్కార్‌కు ఛాలెంజ్ చేస్తున్నామని, వాళ్లు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతి వేదికగా సమాధానం చెప్పాలన్నారు. లౌకిక పార్టీల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.  

Updated Date - 2020-12-13T21:14:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising