ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2024లో జనసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: సోము వీర్రాజు

ABN, First Publish Date - 2020-09-08T00:54:54+05:30

2024లో జనసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం : 2024లో జనసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో విశాఖ తొలి మున్సిపల్ కార్పోరేషన్ విజయ స్మృతులు సభ జరిగింది. ఈ సమావేశంలో భాగంగా.. మొదటి కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్‌లను, అభ్యర్థులను ఆయన సన్మానించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ, జనసేన కలిసి మార్పులు తీసుకొస్తాయని చెప్పారు. రాబోయే రోజుల్లో సంయుక్తంగా ముందుకెళ్తామని.. తాము కూడా రాజకీయాలను శాసిస్తామన్నారు. 


చైనానే గడగడలాడించింది..!

నేడు వెన్నుపోటు రాజకీయాలు చూసి ఎందుకు భయపడాలి. తప్పకుండా ఈసారి విశాఖ కార్పొరేషన్ మనమే కైవసం చేసుకుంటాం. మేము ఓట్లు కోసం, సీట్లు కోసం లేము.. దేశం, సమాజం కోసం ఉన్నాం. భారత దేశ చరిత్రలో ఉద్యమ స్ఫూర్తి ఉన్న పార్టీ బీజేపీ. 1982 ఒక వాహనంపై యాత్ర చేసి ప్రజల మనసులు గెలుచుకున్న వ్యక్తి ఎన్టీఆర్. ఇందిరా మృతి చెందిన సమయం దేశంలో కాంగ్రెస్ గాలి ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే టీడీపీ గెలిచింది. కేంద్రంలో ప్రతిపక్ష స్థానంలో పనిచేసింది. ఇప్పుడు రాజకీయాలను డబ్బు నడుపుతోంది. అలాంటి రాజకీయాలను పారద్రోలుతాం. బీజేపీ ప్రభుత్వం చైనాను గడగడలాడించింది. అలాంటి బీజేపీ సారథ్యంలో మరిన్ని విజయాలు సాధించాలి. రాష్ట్రంలో భూములను రాబందుల్లా దోచుకుంటున్నారు. రాష్ట్రంలో కొన్ని అంశాలు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి అని వీర్రాజు చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-09-08T00:54:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising