ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో బీద రవిచంద్ర!

ABN, First Publish Date - 2020-09-24T07:51:34+05:30

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ కూర్పుపై జరుగుతున్న కసరత్తులో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ప్రతిపక్షంలోకి వచ్చిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంద్రబాబు ముందు ప్రతిపాదనలు.. ఇప్పటికే ప్రచారంలో అచ్చెన్న 


అమరావతి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ కూర్పుపై జరుగుతున్న కసరత్తులో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పార్టీ కమిటీల్లోకి కొత్త నెత్తురు ఎక్కించి వాటిని క్రియాశీలం చేయాలన్న లక్ష్యంతో అధినేత చంద్రబాబు రకరకాల సమీకరణలను పరిశీలిస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర పేరు రాష్ట్ర అధ్యక్ష పదవికి, దివంగత నేత కె.ఎర్రన్నాయుడి కుమారుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడి పేరు తెలుగు యువత అధ్యక్ష పదవికి పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.


ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు ఉన్నారు. ఆయన స్థానంలో ఎర్రన్నాయుడి తమ్ముడు, ప్రస్తుత టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడి పేరు ఇప్పటికే ప్రచారంలోకి వచ్చింది. సీనియర్ల బదులు యువ నేతలను ఈ పదవులకు ఎంపిక చేస్తే ఉత్సాహంగా తిరుగుతారని.. పార్టీ కార్యక్రమాల్లో కదలిక వస్తుందని కొందరు సీనియర్లు చంద్రబాబు వద్ద ప్రతిపాదించారు. ఈ కోణంలోనే రవిచంద్ర పేరు పరిశీలనకు వచ్చింది.


తెలుగు యువత అధ్యక్ష పదవి చేపట్టడానికి రామ్మోహన్‌నాయుడు అంత సుముఖంగా లేరు. తనకు శ్రీకాకుళం లోక్‌సభ ఎంపీ బాధ్యతలు ఉన్నందువల్ల ఈ పదవికి న్యాయం చేయలేనని, మరెవరినైనా పరిశీలించాలని ఆయన అంటున్నారు. ఈ నెల 27వ తేదీన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పేరును కూడా ప్రకటిస్తారని ప్రచారం జరిగినా అది నిజం కాదని, రాష్ట్ర కమిటీ ప్రకటన తర్వాత ఉంటుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ రోజు మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 25 మంది అధ్యక్షులను ప్రకటిస్తారని వివరించాయి.


Updated Date - 2020-09-24T07:51:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising