ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కులానికో సొసైటీ

ABN, First Publish Date - 2020-02-22T09:30:03+05:30

బీసీల్లో దాదాపు ప్రతి కులానికి ఒక సహకార ఆర్థిక కార్పొరేషన్‌, అభివృద్ధి సొసైటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. గత ప్రభుత్వం బీసీలకు 11 సమాఖ్యలను ఏర్పాటు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీసీల్లో సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వ యోచన

రాష్ట్రంలో ఇప్పుడున్నవి 11 

కొత్తగా మరో 41 ఏర్పాటుకు సన్నాహాలు


అమరావతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): బీసీల్లో దాదాపు ప్రతి కులానికి ఒక సహకార ఆర్థిక కార్పొరేషన్‌, అభివృద్ధి సొసైటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. గత ప్రభుత్వం బీసీలకు 11 సమాఖ్యలను ఏర్పాటు చేసింది. బీసీల్లోని ప్రధాన కులాలతోపాటు, మరికొన్నిటిని ఒక్కో గ్రూప్‌గా చేసి ఈ సమాఖ్యల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. 

ఇప్పుడు ఆ 11కు జతగా మరో 41 సొసైటీలను ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. త్వరలోనే దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటారని సమాచారం. రజక, యాదవ, తూర్పుకాపు, మత్స్యకార, నాయీ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, గౌడ, కుమ్మరి శాలివాహన తదితర సహకార ఆర్థిక కార్పొరేషన్లు గతంలోనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కలింగ కోమటి, రెడ్డిక, జంగం, దేవాంగ, తొగట, కుర్మి, పోలినాటి వెలమ, కృష్ణ బలిజ, మేదర, ఆరెకటిక, పెరిక, కుంచిటి వక్కలిగ, సూర్య బలిజ, ముదలియార్‌, చట్టదాసరివైష్ణవ, శిష్టకరణాలు, కూరాకుల, ఆర్యక్షత్రియ, అయ్యారక, అతిరాస్‌, దాసరి, యాట, శ్రీశయన తదితర కులాలతోపాటు, వాటి ఉపకులాలను చేర్చి ఈ సొసైటీలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో  బీసీలు ఏ కులంలో ఎంతమంది ఉన్నారన్న వివరాలు ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్‌ ఈ సొసైటీల ఏర్పాటుపై ఒక నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. 

Updated Date - 2020-02-22T09:30:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising