ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ 1900 ఏం చేస్తున్నారు?.. నాకు తెలిసిందేంటంటే..: అయ్యన్నపాత్రుడు

ABN, First Publish Date - 2020-07-18T15:38:51+05:30

అమరావతి: క్వారెంటైన్‌లో ఉన్నవారికి భోజనం పెట్టే విషయంలో కూడా ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: క్వారెంటైన్‌లో ఉన్నవారికి భోజనం పెట్టే విషయంలో కూడా ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అసలు మెనూలో ఉన్న విధంగా ఎవరికైనా పెడుతున్నారా? అని ప్రశ్నించారు. క్వారెంటైన్‌లో 14 రోజులు గడిపి ఇంటికి వెళ్లిపోయేటప్పుడు వారికి దారి ఖర్చులకు రెండు వేల రూపాయలు ఇస్తాం అని ప్రకటించారని.. ఎవరికైనా ఇస్తున్నారా? అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.


‘‘నేను చాలా మందితో మాట్లాడాక తెల్సిందేమిటంటే వెళ్లిపోయేటప్పుడు వంద రూపాయలు ఇస్తున్నట్టు తెలిపారు. మిగతా 19 వందలు ఏం చేస్తున్నారు?.. అవి కూడా ఇచ్చేసినట్టు రాసుకుంటున్నారా?... నర్సీపట్నం, అనకాపల్లి, విశాఖపట్నం హాస్పిటల్స్‌లో టెస్టింగ్ కిట్లు లేవు... లక్షల లక్షల కిట్లు ఏమైపోయాయి? ఇంత సీరియస్ విషయంలోనూ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది? ప్రజల ఆరోగ్యంతో, ప్రజల ప్రాణాలతో ఆటలాడొద్దని ముఖ్యమంత్రికి మనవి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు మన రాష్ట్రానికి కరోనా నిమిత్తం ఎనిమిది వేల కోట్లు ఇచ్చింది... ఆ ఎనిమిది వేల కోట్లు ఎక్కడ ఖర్చుపెట్టారో ప్రజలకు చెప్పాలి కదా!’’ అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. 


Updated Date - 2020-07-18T15:38:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising