ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజుకు 3 రేప్‌లు!

ABN, First Publish Date - 2020-08-31T08:14:18+05:30

‘‘మహిళల రక్షణకు మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. హోంశాఖ మంత్రిగా కూడా మహిళనే నియమించాం. ‘దిశ’(చట్టం అమలు కాలేదు)తో రేపిస్టులకు సత్వర శిక్షలు పడేలా చేస్తున్నాం. మహిళలపై ఎవరైనా నేరాలకు పాల్పడితే జీవితం జైలుపాలే’’ ఇవీ సీఎం జగన్‌ నుంచి మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధులు నిరంతరం చెబుతున్న మాటలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • నెలకు 98 అకృత్యాలు
  • ఆర్నెల్లలో 584 అత్యాచారాలు
  • అగ్రస్థానంలో విశాఖపట్నం
  • హోంమంత్రి జిల్లాలోనూ ఇంతే
  • బాధితుల్లో 20శాతం మంది దళితులే
  • ‘దిశ’ ఉన్నా ఆగని లైంగిక దాడులు
  • ఎక్కడికక్కడ మోసాలు, ఘర్షణలు 
  • నేరాంధ్ర దిశగా రాష్ట్ర ప్రయాణం



(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘‘మహిళల రక్షణకు మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. హోంశాఖ మంత్రిగా కూడా మహిళనే నియమించాం. ‘దిశ’(చట్టం అమలు కాలేదు)తో రేపిస్టులకు సత్వర శిక్షలు పడేలా చేస్తున్నాం. మహిళలపై ఎవరైనా నేరాలకు పాల్పడితే జీవితం జైలుపాలే’’ ఇవీ సీఎం జగన్‌ నుంచి మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధులు నిరంతరం చెబుతున్న మాటలు. అయితే, రాష్ట్రంలో పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. గడిచిన కొన్నాళ్లుగా జరిగిన పరిస్థితులను గమనిస్తే.. భర్త కళ్లముందే వివాహితపై గ్యాంగ్‌ రేప్‌ జరిగింది. ప్రియుడితో బైకుపై షికారుకు వెళ్లలేదు అయినా నిర్బంధించి యువతిపై అత్యాచారం చేశారు. మరోఘటనలో ఇంట్లోనే ఉన్న బాలికపై లైంగిక దాడి జరిగింది. ఇలా రాష్ట్రంలో ప్రతి రోజూ ముగ్గురికిపైగా నెలకు 98 మంది చొప్పున మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి.  


నేరాంధ్ర దిశగా!

ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు జరిగిన నేరాలను పరిశీలిస్తే.. మూడున్నర నెలలు ప్రజలు లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటికే పరిమితమయ్యారు. అయినా కూడా అత్యాచారాలు ఏమాత్రం తగ్గలేదు. దీంతో నవ్యాంధ్ర  కాస్తా నేరాంధ్రగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మహిళలపై అత్యాచారాలు మొదలుకొని దళితులపై వరుస దాడులు, ప్రతిపక్షాలపై అధికార నేతల దౌర్జన్యాలు వంటివి నిత్యకృత్యంగా మారాయి. ఇక, సీఎం సొంత జిల్లా కడపలో మద్యం స్మగ్లర్‌ను అడ్డుకున్న ఎస్‌ఐని కారుతో ఢీ కొట్టడం.. కర్నూలు జిల్లాలో మంత్రి సోదరుడి పెకాటడెన్‌కు వెళ్లిన పోలీసులపై దాడులకు దిగడం.. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లలోని పరిస్థితులను తలపిస్తున్నాయని అంటున్నారు. ‘దిశ’ చట్టం చేసి ప్రత్యేక పోలీసు స్టేషన్ల ద్వారా నిందితులకు సత్వర శిక్షలు పడేలా చూస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, రాష్ట్రంలో మహిళల పరిస్థితి మాత్రం దారుణంగా ఉందనే వాదన వినిపిస్తోంది. గడిచిన మూడేళ్లలో నేర గణాంకాలను పరిశీలిస్తే ఏటా అత్యాచారాల సంఖ్య పెరుగుతూనే ఉంది. హోంశాఖ మంత్రి మహిళ అని, ఎస్సీ వర్గానికి చెందిన నాయకురాలని ప్రభుత్వం గొప్పగా చెబుతున్నా ఆమె సొం త జిల్లా, సీఎం నివాసం ఉంటున్న గుంటూరులోనూ మహిళలపై అత్యాచార ఘటనలు ఏమాత్రం తగ్గడం లేదు. కాగా, ‘స్పందన’లో నమోదవుతున్న ఫిర్యాదుల కారణంగానే కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని ఓ పోలీస్‌ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.  




ఈ జిల్లాల పరిస్థితి దారుణం

గుంటూరు జిల్లాలో ప్రతి నెల 10 చొప్పున ఆర్నెల్లలో 59 అత్యాచారాలు జరిగాయి. పాలనా రాజధానికి అనువైన నగరమని సర్కారు చెబుతున్న విశాఖజిల్లాలో 180 రోజుల్లో 90 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో రాష్ట్రంలోనే విశాఖ అగ్రస్థానంలో ఉంది. తూర్పు గోదావరి జిల్లా 85 అత్యాచార కేసులతో రెండో స్థానంలో ఉంది. పశ్చిమ గోదావరి(50), ప్రకాశం(40) కేసులు నమోదయ్యాయి. దీం తో మహిళలకు రక్షణలేని జిల్లాల జాబితాలో చేరిపోయాయి.

Updated Date - 2020-08-31T08:14:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising