మంత్రి వెలంపల్లిపై దాడిచేశారు
ABN, First Publish Date - 2020-06-18T08:47:51+05:30
మంత్రి వెలంపల్లిపై దాడిచేశారు
అమరావతి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): శాసనమండలి జరుగుతుంటే టీడీపీ సభ్యులు ఫొటోలు తీశారని, అలా తీయొద్దని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, తాను చెప్పామని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. వెలంపల్లిపై టీడీపీ ఎమ్మెల్సీలు దాడి చేశారని బుధవారం మీడియా పాయింట్లో చెప్పారు. రెచ్చగొట్టవద్దని వెలంపల్లి చెబితే.. బీద రవిచంద్ర మరి కొందరు ఎమ్మెల్సీలు దాడి చేశారని.. మంత్రిపై దాడి చేసి గాయపరచిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్సీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదిమూలపు సురే్‌శ్ అన్నారు. సభ అంటే టీడీపీ సభ్యులకు గౌరవం లేదని మండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు.
పోటీపడి మరీ కొట్టుకున్నారు: సోము వీర్రాజు
అధికార, ప్రతిపక్ష సభ్యులు మండలిలో పోటీపడి ఒకరినొకరు కొట్టుకున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. పెద్దల సభలో చాలా దురదుష్టకరమైన సంఘటన చోటు చేసుకుందన్నారు. బీజేపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలం ప్రేక్షక పాత్ర వహించామని చెప్పారు.
Updated Date - 2020-06-18T08:47:51+05:30 IST