ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీరజవానుల మరణాల్లో కూడా కులాన్ని బట్టి సాయం: అయ్యన్న

ABN, First Publish Date - 2020-11-11T22:53:56+05:30

వీరజవానుల మరణాల్లో కూడా కులాన్ని బట్టి సాయం చేయడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన వీరజవాన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: వీరజవానుల మరణాల్లో కూడా కులాన్ని బట్టి సాయం చేయడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన వీరజవాన్‌ బాబురావు కుటుంబానికి.. ముఖ్యమంత్రి జగన్ కనీసం ఒక సంతాప సందేశం కూడా పంపలేదని తప్పుబట్టారు. వీరజవాను బొంగు బాబురావు కుటుంబానికి ఎందుకు సాయం చేయలేదని ప్రశ్నించారు. నాడు- నేడు పథకంలో అవినీతిపై ఏసీబీ విచారణ చేపట్టాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. పాత భవనాలకు మరమ్మతులు.. బెంచీలకు రంగులు వేసి కోట్లు కొల్లగొట్టారని, అధికార పార్టీ ఎమ్మెల్యేనే డీఆర్సీ సమావేశంలో చెప్పారని తెలిపారు. నాడు- నేడు పథకానికి ఇన్‌చార్జ్‌గా ఉన్న.. సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ అవినీతిపై విచారణ జరపాలని అయ్యన్న డిమాండ్ చేశారు. వీఎంఆర్డీఏ పరిధిలో పేదలకు కేటాయించిన స్థలాల చదును పనుల్లో రూ.23 కోట్ల అవినీతి జరిగిందని, విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యన్నపాత్రుడు కోరారు.


Updated Date - 2020-11-11T22:53:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising