ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తరాంధ్ర ఏమైనా మంత్రి జాగీరా?: అశోక్‌బాబు

ABN, First Publish Date - 2020-02-28T19:07:48+05:30

మంగళగిరి (గుంటూరుజిల్లా): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబును..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగళగిరి (గుంటూరుజిల్లా): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబును ఉత్తరాంధ్రలో తిరగనివ్వబోమని మంత్రి అంటున్నారని, ఉత్తరాంధ్ర ఏమైనా మంత్రి జాగీరా? అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును విశాఖ రానివ్వమని మంత్రి బొత్స అంటున్నారని, విశాఖను మంత్రి బొత్స  రాయించుకున్నారా? అని అడిగారు. రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా విశాఖలో మాత్రం ప్రజలు టీడీపీనే గెలిపించారన్నారు. జగన్‌ వస్తే ఏం చేయరనే నాలుగు సీట్లలో టీడీపీని గెలిపించారని అశోక్‌బాబు అన్నారు.


ఏ1, ఏ2 లు విశాఖలో భూకబ్జాలు చేస్తున్నారని అశోక్‌బాబు ఆరోపించారు. వైసీపీ నేతలు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకువచ్చి..వారికి పచ్చ చీరలు కట్టించి బాబును అడ్డుకునేలా చేవారని విమర్శించారు. వైసీపీ నేతలు ఒక ప్లాన్ ప్రకారమే చంద్రబాబుపై దాడి చేయించారని ఆరోపించారు. ఇలాంటి దాడులకు టీడీపీ భయపడుదన్నారు. చంద్రబాబు మళ్లీ విశాఖ వస్తారని, భూకబ్జాలను సాక్ష్యాలతో సహా నిరూపిస్తారన్నారు. ఉత్తరాంధ్రలో నెల రోజులు పర్యటించి ప్రజలకు వైసీపీ అరాచకాలు వివరిస్తామని అశోక్‌బాబు స్పష్టం చేశారు.


Updated Date - 2020-02-28T19:07:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising